ఆత్మాహుతి దాడిలో కర్జాయ్ సోదరుడి మృతి
కాబూల్: రంజాన్ పండుగనాడు ఓ ముష్కరుడి ఆత్మాహుతి దాడితో అఫ్ఘానిస్థాన్ అధ్యక్షుడు హమీద్ కర్జాయ్ కుటుంబం విషాదంలో మునిగిపోయింది. కాందహార్ రాష్ట్రంలోని కర్జ్ జిల్లాలో మంగళవారం మానవ బాంబర్ జరిపిన దాడిలో కర్జాయ్కి వరుసకు సోదరుడు, ఆయనకు గట్టి మద్దతుదారుడైన హష్మత్ ఖలీల్ కర్జాయ్ మృతిచెందారు. రంజాన్ ప్రార్థన తర్వాత హష్మత్కు శుభాకాంక్షలు తెలపడానికి ఆయన ఇంటికొచ్చిన బాంబర్ ఆయనతో కరచాలనం చేసి, తన తలపాగాలో దాచిన బాంబులను పేల్చేసుకున్నాడు.
2011 సెప్టెంబర్లో అఫ్ఘాన్ మాజీ అధ్యక్షుడు రబ్బానీ కూడా అచ్చం ఇలాంటి దాడిలోనే చనిపోయారు. ప్రైవేటు సెక్యూరిటీ కంపెనీని నిర్వహిస్తున్న హష్మత్ కర్జాయ్ దేశాధ్యక్ష పదవికి పోటీ పడుతున్న మాజీ ఆర్థిక మంత్రి అషఫ్ ్రఘనీ అహ్మద్జాయ్కి మద్దతిస్తున్నారు. హమీద్ సవతి సోదరుడు అహ్మద్ వలీ 2011లో తన అంగరక్షకుడి దాడిలో చనిపోయాడు.