అభివృద్ధికి ప్రజల సహకారం అవసరం
జవహర్‌నగర్, న్యూస్‌లైన్ : నియోజకవర్గాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు తన శాయశక్తులా కృషి చేస్తున్నానని, ఇందుకు ప్రజలందరూ సహకరించాలని మేడ్చల్ ఎమ్మెల్యే కిచ్చన్నగారి లకా్ష్మరెడ్డి కోరారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును పురస్కరించుకుని బుధవారం జవహర్‌నగర్‌లో కాంగ్రెస్ నాయకులు ఏర్పాటు చేసిన భారీ కేక్‌ను ఆయన కట్ చేసి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసి మాట్లాడారు.
జవహర్‌నగర్‌లో అధికశాతం పేదప్రజలే నివసిస్తున్నారని వారందరికీ మౌలిక సదుపాయాలు కల్పించడం తన లక్ష్యమన్నారు. జవహర్‌నగర్‌ను మంచి పట్టణంగా రూపుదిద్దడానికి తన వంతు కృషి చేస్తున్నాననీ, మూడు నెలల్లోపు ప్రతి ఇంటికీ నీరు సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. అనంతరం రూ.48.50కోట్లతో కాప్రా రాధిక మల్టిప్లెక్స్ నుంచి చెన్నాపురం మీదుగా జౌటర్రింగ్ రోడ్డు వరకు నాలుగు లేన్ల రేడియల్ రోడ్డు, అలాగే రూ.కోటి 26లక్షలతో శాంతినగర్‌లో వాటర్సంపు, పలు కాలనీల్లో సీసీ రోడ్లు, అంతర్గత డ్రెయినేజీ పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు.
రూ.25లక్షలతో నిర్మించిన జవహర్‌నగర్, బీజేఆర్నగర్లలో రూ.25లక్షలతో నిర్మించిన ప్రభుత్వ పాఠశాలలను ప్రారంభించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జవహర్‌నగర్ అధ్యక్షుడు సత్యం, మాజీ సర్పంచ్ శంకర్‌గౌడ్, మాజీ ఉపసర్పంచ్ నర్సింహగౌడ్, ఎరుకల ప్రజాసంఘం చైర్మన్ కుతాడి శ్రీనివాస్, అధికార ప్రతినిధి రెడ్డిశెట్టి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి బల్లిశ్రీను, నాయకులు ఎండీ ఫారుక్, విజయరాయ్, కాంగ్రెస్ పార్టీ జవహర్‌నగర్ మహిళా అధ్యక్షురాలు బొబ్బిలి మంజుల తదితరులు పాల్గొన్నారు.