kid killed
-
ప్రియుడితో ఉండగా చూశాడని.. కొడుకు హత్య
సాక్షి, తిరువళ్లూరు(కర్ణాటక): వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని.. కన్న కొడుకునే హత్య చేయించిన తల్లి, ఆమె ప్రియుడ్ని పోలీసులు అరెస్టు చేశారు. తిరువళ్లూరు జిల్లా పొన్నేరి నెడువరంపాక్కంకి చెందిన సెల్వంభార్య దుర్గ. వీరికి సూర్య(14), శృతి(12), సంతోష్(8) అనే ముగ్గురు పిల్లలున్నారు. గత 9న అన్నామలై(17), గోపాలకృష్ణన్(21) సూర్యను తీసుకెళ్లి హత్య చేశారు. సూర్య తాత ఫిర్యాదు మేరకు చోళవరం పోలీసులు గోపాలకృష్ణన్‌ను ప్రశ్నించారు. ఈక్రమంలో సూర్య తల్లిదుర్గకు, గోపాలకృష్ణన్‌కు మధ్య అక్రమ సంబంధం ఉన్నట్లు తెలిసింది. దుర్గ, గోపాలకృష్ణన్ ఏకాంతంగా ఉన్నప్పుడు సూర్య చూశాడనే కారణంతోనే హత్య చేసినట్లు వెల్లడైంది. చదవండి: karnataka: బస్సులో యువతి పట్ల అసభ్య ప్రవర్తన -
బైక్‌ను ఢీకొన్న లారీ
చిన్నారి మృతి, మరో ఇద్దరికి తీవ్రగాయాలు చింతలగుంట (దుత్తలూరు) : మితిమీరిన వేగంతో వెళ్తున్న లారీ ముందు వెళ్లే బైక్‌ను ఢీకొన్న సంఘటనలో ఓ చిన్నారి మృతి చెందగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలైన సంఘటన గురువారం మండలంలోని చింతలగుంట వద్ద జరిగింది. దుత్తలూరు పంచాయతీ రాఘవరెడ్డిపల్లికి చెందిన అంబటి శ్రీనివాసులుకు చింతలగుంటకు చెందిన శ్రావణితో రెండేళ్ల క్రితం వివాహమైంది. వీరికి 15 నెలల తనీష్ ఉన్నాడు. శ్రావణి ఇటీవల పుట్టింటికి వెళ్లింది. గురువారం శ్రీనివాసులు సోదరుడు వెంకటేశ్వర్లు తన కుమార్తె అనితతో కలిసి తనీష్‌ను చూడటానికి చింతలగుంట వెళ్లాడు. అక్కడి నుంచి బైక్‌పై తనీష్, అనితను తీసుకుని నందిపాడుకు వెళ్లి తిరిగి చింతలగుంటకు వెళ్తున్నారు. ఈ క్రమంలో వెనుక నుంచి వేగంగా వచ్చిన లారీ బైక్‌ను ఢీకొనడంతో బైక్‌పై ఉన్న ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. చిన్నారి తనీష్‌కు బలమైన గాయాలయ్యాయి. క్షతగాత్రులను ప్రైవేట్ వాహనంలో దుత్తలూరులోని ఓ ప్రైవేట్ వైద్యశాలకు తరలించి ప్రథమ చికిత్స అనంతరం వింజమూరుకు తరలించారు. అక్కడ వైద్యులు పరీక్షించి అప్పటికే చిన్నారి మృతి చెందినట్లు నిర్ధారించారు. ఇద్దరిని మెరుగైన వైద్యం కోసం నెల్లూరుకు తరలించారు. సంఘటనా స్థలాన్ని ఎస్సై సైదులు తన సిబ్బందితో కలిసి పరిశీలించారు. స్థానికుల కోపోద్రిక్తం చింతలగుంట వద్ద బైక్‌ను లారీ ఢీకొనడంతో అక్కడే ఉన్న స్థానికులు డ్రైవర్‌కు దేహశుద్ధి చేశారు. లారీ అద్దాలను పగులగొట్టారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. మృతదేహంతో ఆందోళన మృతి చెందిన చిన్నారిని ఆటోలో తీసుకువచ్చి గ్రామస్తులు, స్థానికులు పెద్దఎత్తున ఆందోళన చేశారు. తల్లి శ్రావణి తన ఒక్కగానొక్క చిన్నారి మృతి చెందడంతో కన్నీరుమున్నీరైంది. ఈ సంఘటన చూసిన పలువురు కన్నీటి పర్యంతమయ్యారు. రాఘవరెడ్డిపల్లి, చింతలగుంట గ్రామాల్లో విషాదఛాయలు అలముకున్నాయి. పోలీసులు కలుగజేసుకుని గ్రామస్తులు, స్థానికులకు సర్ది చెప్పడంతో ఆందోళన విరమించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సైదులు తెలిపారు.