వెలుగులోకి నామ్ కొడుకు.. ‘నాన్నది హత్య’
ప్యాంగ్యాంగ్: మలేషియా విమానాశ్రయంలో విష ప్రయోగానికి గురై ప్రాణాలు కోల్పోయిన ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ నామ్ కుమారుడి వీడియో ఒకటి తాజాగా బయటకు వచ్చింది. 40 సెకన్లపాటు ఉన్న ఈ వీడియో మార్చి 7న యూట్యూబ్‌లో ప్రత్యక్షమైంది. ఆ వీడియోలో ఉన్న యువకుడు తనను తాను కిమ్ హాన్ సోల్‌గా చెప్పుకున్నాడు. తాను కిమ్ జాంగ్ నామ్ కుమారుడినని ప్రస్తుతం తన తల్లి, సోదరితో కలిసి ఉత్తర కొరియాలోనే ఉంటున్నాని చెప్పాడు. అసంపూర్తిగా అర్ధమయ్యేలా బ్రిటన్ ఇంగ్లిష్ భాషలో అతడు మాట్లాడాడు.
‘నాపేరు కిమ్ హాన్ సోల్. నేను ఉత్తర కొరియా నుంచి మాట్లాడుతున్నాను. నేను కిమ్ కుటుంబంలో భాగం’ అని స్వయంగా చెప్పాడు. ఈ సందర్భంగా అతడు తన పాస్‌పోర్టును కూడా చూపించాడు. ప్రస్తుతం తాము సురక్షితంగానే ఉన్నామని చెప్పాడు. ఫిబ్రవరి 13న తండ్రిని హత్య చేశారని చెప్పారు. అతడిని నామ్ పెద్ద కుమారుడు సోల్ (22) అని దక్షిణ కొరియా ఇంటెలిజెన్స్ విభాగం కూడా స్పష్టతనిచ్చింది. అయితే, ఈ వీడియో బయటకు వచ్చిన కొద్ది సేపటికే అతడికి విపరీతమైన మద్దతు వచ్చింది. అతడికి తాము రక్షణ కల్పిస్తామని, సురక్షితంగా తమ ప్రాంతాలకు తీసుకొస్తామని చెబుతూ పలువురు భరోసా ఇచ్చారు. ఈ వీడియో బయటకు రావడంపై ఉత్తర కొరియా అధికారులు ఇప్పుడు తెగ కంగారుపడిపోతున్నారని తెలుస్తోంది.