సిక్కోల్లో భీమవరం బుల్లోడు సందడి
శ్రీకాకుళం కల్చరల్ : ‘భీమవరంబుల్లోడు’ సినిమా యూనిట్ సోమవారం శ్రీకాకుళం పట్టణంలోని కిన్నెర హాల్లో సందడి చేసింది. సినీ ప్రేక్షకులను అలరించింది. సినిమాల్లోని కొన్ని డైలాగ్‌లు చెబుతూ, పాటలకు డ్యాన్స్ చేస్తూ హీరో, హీరోరుున్లు సునీల్, ఎస్తేరులు ఉర్రూతులూగించారు.
అనంతరం సునీల్ మాట్లాడుతూ సినిమాను ఆదరించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు. సినిమాలో పాటలు, కథ ఎలా ఉందని అడిగారు. హీరోయిన్ ఎస్తేరు మాట్లాడుతూ మంచి హిట్ ఇచ్చినందుకు ఎంతో ఆనందంగా ఉందన్నారు. మ్యూజిక్ డెరైక్టర్ అనూప్ రూబెన్స్ పలు గీతాలను ఆలపించారు. వీరితో పాటుగా నటులు సత్యం రాజేష్, పృధ్విరాజ్, థియోటర్ మేనేజర్ వరప్రసాద్‌లు పాల్గొన్నారు.
తెలుగు ‘గోవిందా’ కావాలనుంది
హిందీ హీరో గోవిందా వలే తెలుగు గోవింద కావాలని ఉందని భీమవరం బుల్లోడు హీరో సినీల్ అన్నారు. స్థానిక కిన్నెర థియేటర్లో నిర్వహించిన సక్సెస్ మీట్లో విలేకరులతో కాసేపు ముచ్చటించారు. హిందీలో గోవిందా ఇటు కమెడియన్‌గా, అటు హీరోగా చేసిన సక్సెస్ చూసిన తరువాత ఈ కోరిక కలిగిందన్నారు. తడాఖాలాంటి సినిమాలో నటించే అవకాశం వస్తే తప్పక నటిస్తానన్నారు. హీరోగా అయితే డైటింగ్ చేసి స్లిమ్స్గా ఉండేందుకు ప్రయత్నించాలన్నారు.
హీరో ఛాన్సుకన్నా కమెడియన్‌గా చేయడం చాలా ఇష్టమన్నారు. ఇక్కడి ప్రేక్షకుల ఆదరణ చాలా బాగుందన్నారు. కవి దూర్జటి రచించిన ‘భక్త కన్నప్ప’ సినిమాలో నటిస్తున్నానని తెలిపారు. అలాగే, నల్లమల బుజ్జి, మోహన్‌లు నిర్మిస్తున్న మరో రెండు సినిమాల్లో నటిస్తున్నట్టు వెల్లడించారు. సేవా కార్యక్రమాలు చేయడమంటే చాలా ఇష్టమన్నారు. అందు లో చుదువుకోసం సహాయం చేసేం దుకు ఎప్పుడూ ముందుంటానన్నా రు. రాజకీయాలంటే ఇష్టంలేదన్నా రు. ఈ సినిమాకు మాటల రచయిత అయిన సీపాన సురేష్ మీజిల్లా వాడేనని తెలిపారు. అందుకే విజయోత్సవాన్ని ఇక్కడి నుంచి ప్రారంభించామన్నారు. హిందీ సినిమాలో అవకాశం వస్తే నటిస్తానని, కానీ తెలుగు సినీ పరిశ్రమను విడిచిపెట్టనన్నారు.
శ్రీధర్‌కు సత్కారం
భీమవరం బుల్లోడు సినిమా మాటల రచయిత జిల్లాకు చెందిన సీపాన శ్రీధర్‌ను స్నేహితులు శంకర తరఫున హీరో సునీల్ దుశ్శాలువతో, దండతో సత్కరించారు. ఈ సందర్భంగా శ్రీధర్ మాట్లాడుతూ తన స్వగ్రామం టెక్కలి అన్నారు. తల్లిదండ్రులు రమణమ్మ, సత్యనారాయణ ఆశీస్సులతో సినిమా ఇండస్ట్రీకి వెళ్లానన్నారు. తను బీఈ చదివానని, సినిమా హిట్ కావడం చాలా ఆనందంగా ఉందన్నారు.