కేకే లైన్లలో రైళ్లకు అంతరాయం
అనంతగిరి: కొత్తవలస–కిరండోల్ (కెకెలైన్) రైలు మార్గంలో గురువారం తెల్లవారుజామున 2గంటల సమయంలో విద్యుత్ తీగలు తెగి పడడంతో రైళ్లరాకపోకలు నిలిచిపోయాయి. సుమారు 10గంటల సేపు ఈ మార్గం గుండా రైల్లు నిలచిపోయాయి.టర్నల్ నెంబరు 19 లో గల విద్యుత్ కంటిలీవర్లు రెండు దెబ్బతినడంతో కిరండూల్నుండి విశాఖ పట్నం వస్తున్న గూడ్సురైలు అక్కడే నిలచిపోయింది.దాంతో నిలిచిన గూడ్సురైలును ప్రత్యేక ఇంజనుతో మైదాన ప్రాంతానికి తరలించి పునరుద్ధ్దరణ చర్యలను రైల్వేశాఖ ప్రారంభించింది.57బై1,3,4 కిలో మీటర్ వద్ద శంగవరపుకోట,అరుకులోయ ఒహెచ్ఇ సిబ్బంది పునరుద్ధ్దరణ చర్యలు చేపట్టి మార్గాన్ని సుగమం చేశారు.ఈ ఘటన వల్ల రైల్లు 10గంటలసేపు నిలచిపోయాయి.మధ్యాహ్నం 12 గంటల వరకు పునరుద్ధరణ పనులు సిబ్బంది చేపట్టారు. సాయంత్రం నుంచి రైళ్లు నడిచాయి.