నేడు వైఎస్సార్ సీపీలోకి ‘కొల్లుబోయిన’
పెద్దాపురం రానున్న వైఎస్సార్ సీపీ నాయకులు
పెద్దాపురం :
అఖిల భారతీయ యాదవ మహాసభ జిల్లా యువజన అధ్యక్షుడు కొల్లుబోయిన శ్రీనివాస్ యాదవ్ శుక్రవారం వైఎస్సార్ సీపీలో చేరనున్నారు ఈ నేపథ్యంలో జిల్లాకు చెందిన ప్రముఖ నాయకులంతా పెద్దాపురం రానున్నట్లు నియోజకవర్గ కో–ఆరి్టనేటర్ తోట సుబ్బారావు నాయుడు తెలిపారు. గురువారం ఆయన స్థానిక విలేకర్లతో మాట్లాడుతూ ఉదయం 11.25 గంటలకు శ్రీనివాస్ యాదవ్ ముహూర్తం ప్రకారం పార్టీలో చేరతారని, తదుపరి స్థానిక సుధా కాలనీ క్యాంపు కార్యాలయం నుంచి సుమారు 1000 బైక్‌లతో పట్టణంలో ర్యాలీ నిర్వహించనున్నామన్నారు. దీనిలో భాగంగా సాయంత్రం 5 గంటలకు స్థానిక ఆర్యవైశ్య కల్యాణ మండపంలో నిర్వహించే సమావేశానికి పార్టీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు, రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు జక్కంపూడి రాజా, కాకినాడ పార్లమెంటరీ నియోజకవర్గ ఇ¯ŒSఛార్జి చలమలశెట్టి సునీల్, తుని, రంపచోడవరం, కొత్తపేట ఎమ్మెల్యేలు దాడిశెట్టి రాజా, వంతల రాజేశ్వరి, చిర్ల జగ్గిరెడ్డి, ఎమ్మెల్సీ పిల్లి సుభాష్ చంద్రబోస్, సీనియర్ నాయకులు కుడుపూడి చిట్టబ్బాయి, జిల్లా యూత్ అధ్యక్షుడు అనంత ఉదయ్ భాస్కర్, ఆయా నియోజకవర్గాల కో–ఆరి్డనేటర్లు హాజరవుతారన్నారు. ఈ కార్యక్రమానికి భారీ ఎత్తున కార్యకర్తలు తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చెయ్యాలని సుబ్బారావు నాయుడు పిలుపునిచ్చారు.