విద్యార్థులు సేవాదృక్ఫథాన్ని అలవర్చుకోవాలి
కొండ్రపోల్(దామరచర్ల): విద్యార్థులు సేవాదృక్పథాన్ని అలవర్చుకోవాలని ఆర్డీఓ బి.కిషన్‌రావు కోరారు. శుక్రవారం దామరచర్ల మండలం కొండ్రపోల్‌లో వ్యవసాయ విద్యార్థుల ఎన్ఎస్ఎస్ శిబిరాన్ని ప్రారంభించారు. ఈసందర్భంగా జరిగిన సభలో మాట్లాడుతూ ఎన్ఎస్ఎస్ మానవాళికి మేలు చేసే సేవా కార్యక్రమన్నారు. వారం రోజులపాటు జరిగే ఈకార్యక్రమంలో గ్రామస్తులతో మమేకమై వారి జీవన శైలిని, స్థితితిగతులను గమనించాలని కోరారు. విద్యార్థులు చదువుల అనంతరం ఎప్పుడూ కూడా వ్యక్తిత్వాన్ని వదులుకోవద్దన్నారు. కార్యక్రమంలో ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం అసోసియేటెడ్ డీన్ విష్ణువర్ధన్‌రెడ్డి, తహసీల్దార్ గణేష్, సర్పంచి అడావత్ అచ్చమ్మ ఆనంద్, హెచ్ఎం భీమ్లానాయక్, శాస్త్రవేత్తలు రవీంద్రానాయక్, రాజేశ్వర్‌నాయక్, బాలాజీనాయక్, ముర ళి పాల్గొన్నారు.