మే 1 నుంచి ట్రెజరీ బిల్లులన్నీ ఆన్లైన్లోనే
రాజమండ్రి: ట్రెజరీ బిల్లులను మే 1 నుంచి ఆన్లైన్ విధానం ద్వారా చెల్లించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు ఆ శాఖ రాష్ట్ర డెరైక్టర్ కె.శివప్రసాద్ చెప్పారు. ఉభయ గోదావరి జిల్లాల్లోని ట్రెజరీ ఉద్యోగులకు ఆన్లైన్ విధానంపై అవగాహన కొరకు ఆర్ట్స్ కళాశాలలో శుక్రవారం నిర్వహించిన శిక్షణా కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. అవినీతి ప్రక్షాళన కోసమే ట్రెజరీ బిల్లులను ఆన్లైన్ ద్వారా చెల్లించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు ఆయన చెప్పారు.