94 లక్షల యూనిట్ల విద్యుత్ తయారీ
కూడేరు : మండల పరిధిలోని పెన్నహోబిలం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ (పీఏబీఆర్ )లోని ఏపీ జె¯ŒSకో విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో ఆదివారం నాటికి 94 లక్షల యూనిట్ల విద్యుత్‌ను తయారు చేసినట్లు ఏపీ జెన్ కో డీఈ రఫి అహ్మద్ తెలిపారు. విద్యుత్ ఉత్పత్తిని సుమారు మూడు నెలల క్రితం ప్రారంభించామన్నారు. ప్రస్తుతం విద్యుత్ ఉత్పత్తికి డ్యాం నుంచి సుమారు 700 క్యూసెక్కుల నీరు సరఫరా అవుతోందన్నారు. ఒక రోజుకు 75 వేల యూనిట్ల విద్యుత్ తయారు అవుతోందన్నారు.
గతంలో కోటి 80 లక్షల యూనిట్ల విద్యుత్‌ను తయారు చేయడం జరిగిందన్నారు. ఇప్పుడు కూడా అంత కంటే ఎక్కువనే విద్యుత్‌ను ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఇక్కడ ఉత్పత్తి అయిన విద్యుత్‌ను అనంతపురం నుంచి కళ్యాణదుర్గం వెళ్ళే లై¯ŒSకు కలపడం జరుగుతుందన్నారు.