రాజకీయాలనుంచి తప్పుకుంటున్నా : డీఎల్
సాక్షి ప్రతినిధి, కడప: ‘రాజకీయాలు పూర్తిగా దిగజారిపోయాయి. ఇప్పటి రాజకీయాల్లో కొనసాగలేను. ఇకపై నా మనుగడ కష్టసాధ్యం. మీ సహకారానికి కృతజ్ఞతలు. ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోండి’అంటూ మంగళవారం మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి తన అనుచరులతో పేర్కొన్నట్లు సమాచారం. ఖాజీపేటలో ఈనెల 5న కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసిన ఆయన అభిప్రాయాలు తీసుకున్నారు. అనంతరం మంగళవారం ఖాజీపేటకు చేరుకోవడంతో పలువురు అనుచరులు వెళ్లి కలిశారు. కాంగ్రెస్ పార్టీ నుంచి మరోమారు పోటీ చేయాల్సివస్తే హైదరాబాద్లోని కూకట్పల్లి నుంచి పోటీ చేస్తానని, మైదుకూరులో పోటీ చేసే ప్రసక్తేలేదని తేల్చి చెప్పినట్లు సమాచారం.