హంపి, హారిక విజయం
మహిళల గ్రాండ్ ప్రి చెస్
షార్జా: ఫిడే మహిళల గ్రాండ్‌ప్రి చెస్ తొలి రౌండ్లో ఓటమి పాలైన మహిళా గ్రాండ్ మాస్టర్ కోనేరు హంపి... రెండో రౌండ్లో విజయాన్ని దక్కించుకుంది. మంగళవారం షార్జాలో జరిగిన రెండో రౌండ్ గేమ్‌లో రుమేనియాకు చెందిన ఎల్ అమీ అలీనాను ఓడించింది. తెల్ల పావులతో ఆడిన హంపి 48 ఎత్తుల్లో ప్రత్యర్థికి చెక్ పెట్టింది. మరో గేమ్‌లో ద్రోణవల్లి హారిక 50 ఎత్తుల్లో ముమినోవా నఫీసా (ఉజ్బెకిస్థాన్)ను ఓడించి వరుసగా రెండో విజయం సాధించింది.