ఆర్మీ జవాన్ ఆత్మహత్య.. కశ్మీర్ లో కలకలం
- సరిహద్దులో డ్యూటీ చేస్తూ లాన్స్ నాయక్ విశాల్ బలవన్మరణం
- కశ్మీర్ లోని రాజౌరీలో ఘటన
జమ్ము: భారత్-పాక్ నియంత్రణ రేఖకు సమీపంలోని రాజౌరీ సెక్టార్ లో విధులు నిర్వర్తిస్తోన్న ఓ ఆర్మీ జవాన్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు.లాన్స్ నాయక్ విశాల్ లోహర్ మంగళవారం సాయంత్రం డ్యూటీలో ఉండగానే తన సర్వీస్ రివాల్వర్ తో తలకు గురిపెట్టి కాల్చుకున్నాడని, ఆత్మహత్యకు గల కారణాలను దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు చెప్పారు.
మృతుడు విశాల్ స్వరాష్ట్రం కర్ణాటక. ప్రస్తుతం అతను 54వ రాష్ట్రీయ రైఫిల్స్ లో పనిచేస్తున్నాడు. వివిధ కారణాలతో ఆర్మీ, ఇతర భద్రతా బలగాల్లో పనిచేస్తోన్న జవాన్లు తరచూ ఆత్మహత్యలకు పాల్పడుతుండటం రక్షణ వర్గాలను ఆందోళనపరుస్తున్నాయి.