'భూ ఆక్రమణలపై తక్షణం విచారణ జరిపించాలి'
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని ప్రాంతంలో భూ ఆక్రమణలపై విజిలెన్స్ కమిషనర్ అనురాధకు మంగళగిరి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) ఫిర్యాదు చేశారు.
సీఆర్డీఏ, టీడీపీ నేతలు కలిసి 500 ఎకరాల భూమికి అక్రమంగా రికార్డులు సృష్టించారంటూ ఆయన సోమవారం ఫిర్యాదు చేశారు. ఆక్రమణలపై తక్షణం విచారణ జరిపించాలని విజిలెన్స్ కమిషనర్‌ను ఎమ్మెల్యే ఆర్కే కోరినట్టు సమాచారం.