సీట్లు ఖాళీ ఉంటే అది మీ తప్పే: సుప్రీం
న్యూఢిల్లీ: ఎంసెట్ మలివిడత కౌన్సిలింగ్ గడువును పొడిగించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఎంసెట్‌పై గతంలో తామిచ్చిన సూచనలకే కట్టుబడి ఉండాలని సుప్రీం స్ఫష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలి ఎంసెట్ మలివిడత గడువు పెంచాలని సుప్రీంలో వేసిన పిటిషన్‌పై గురువారం విచారణ జరిగింది. సెప్టెంబర్ 1వ తేదీ నుంచి క్లాసులు మొదలైనందున గడవు పొడగించలేమని తెలిపింది. పదేపదే గడువు పొడిగించమని కోరడం సమంజసం కాదని సుప్రీం అభిప్రాయపడింది.
ఓ వేళ ఇప్పుడు పొడిగిస్తే... మళ్లీ పొడిగించమని కోరరనే గ్యారెంటీ ఏంటని ప్రశ్నించింది. రాష్ట్రంలో 65 వేల ఇంజినీరింగ్ సీట్లు ఖాళీగా ఉన్నాయని ఈ సందర్బంగా విద్యామండలి సుప్రీంకు తెలిపింది. దీనిపై సుప్రీం స్పందిస్తూ ఇంజనీరింగ్ కాలేజీల్లో ఖాళీ సీట్లు ఉండనివ్వండి... అలా ఉన్నాయంటే తప్పు మీదే అని వెల్లడించింది.