ఓ పక్క ప్లానింగ్ అధికారి కొడుకు:మరో పక్క న్యాయవాది కొడుకు!
విశాఖపట్నం: ద్వారకా నగర్లో ఇంజనీరింగ్ విద్యార్థులు రోడ్డెక్కారు. రెండు వర్గాలు చీలిపోయి గొడవపడ్డారు. రుషికొండ సమీపంలోని ఓ ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీకి చెందిన విద్యార్థులు ఘర్షణకు దిగారు. వారు రెండు గ్రూపులుగా విడిపోయి ఒకరినొకరు తోసుకున్నారు.
ఓ గ్రూపుకు జీవీఎంసీ ప్లానింగ్ అధికారి కొడుకు నాయకత్వం వహించగా, మరో గ్రూపుకు ఓ న్యాయవాది కొడుకు నాయకత్వం వహిస్తున్నారు. పట్టణంలోని పోలీసులు మాత్రం వీరి గొడవలను పట్టించుకోవడంలేదు.
**