Leaders list
-
టైమ్ మ్యాగజైన్లో ఇద్దరు బారతీయ అమెరికన్లకు చోటు..!
టైమ్ మ్యాగజైన్ 2024 ఏడాదికి అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల జాబితాను విడుదల చేసింది. వందమంది అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల జాబితాలోని రష్యా ప్రతిపక్ష నాయకుడు అలెక్సీ నవల్నీ భార్య యులియా నవల్ని, ప్రపంచ బ్యాంక్ చీఫ్ అజయ్ బంగా వంటి ప్రముఖులు ఉన్నారు. ఈ జాబితాలో నాయకుల విభాగంలో భారత సంతతికి చెందిన యూఎస్ అధికారి జిగర్ షా, ఇటాలియాన్ ప్రధాన మంత్రి జార్జియా మెలోని, ఇరాన్ మానవ హక్కుల కార్యకర్త నర్గేస్ మొహ్మది వంటి వారు కూడా ఉన్నారు. ఈ జాబితాను టైమ్ మ్యాగజైన్ నాయకులు, ఆదర్శవంతమైన వ్యక్తులు, ఆయా రంగాల్లో ప్రావీణ్యం గల వారుగా వర్గీకరించి మరీ ఈ జాబితాను విడుదల చేసింది. ఇక రష్యా ప్రతిపక్ష నాయకుడు భార్య యులియా తన భర్త మరణాంతరం రాజకీయాల్లోకి వచ్చారు. తన భర్త అలెక్సి ఉనికిని సజీవంగా ఉంచేందుకు రాజకీయాల్లోకి వచ్చినట్లు తెలిపారు. ఇక భారతీయ అమెరికన్ అజయ్ బంగా గతేడాది ప్రపంచ బ్యాంకుకి అధ్యక్షుడయ్యారు. ప్రపంచంలోని ప్రధాన ఆర్థిక సంస్థలైన ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్య నిధికి నాయకత్వం వహించిన తొలి భారత సంతతి అమెరికన్‌గా చారిత్రతక ఘట్టాన్ని ఆవిష్కరించారు. బంగా ఐదేళ్ల కాలానికి 14వ అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. ఈ జాబితాలో మరో భారతీయ అమెరికన్ జిగర్ షా యూఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎనర్జీ ప్రోగ్రామ్ ఆఫీస్ డైరెక్టర్‌గా ఉన్నారు. ఈ డిపార్ట్మెంట్ స్వచ్ఛమైన మౌలిక సదుపాయాలు, ఇంధన కార్యక్రమాల కోసం పబ్లిక్ ఫండ్‌లో దాదాపు వంద బిలియన్ డాలర్లను పర్యవేక్షిస్తుంది. అలాగే నాయకుల జాబితాలో ఉన్న అగ్ర రాజకీయ నాయకులలో టాలియన్ ప్రధాని జార్జియా మెలోని ఒకరు. 47 ఏళ్ల మెలోని 2022లో అధికారంలోకి వచ్చి ఇటలీకి తొలి మహిళ నాయకురాలయ్యింది. ఆమెకు దేశంలో భారీగా మద్దతు ఉండటం విశేషం. ఇక 51 ఏళ్ల నర్గేస్ మొహమ్మది ఇరాన్ మానవహక్కుల కోసం ఆమె అలసిపోని న్యాయవాదానికి గుర్తుగా 2023 నోబెల్ శాంతి బహుమతి గెలుచుకుంది. దీని గురించి ఆమె గత ఇరవై ఏళ్లులో ఎన్నో సార్లు జైలుల పాలయ్యింది. ఇప్పటికీ టెహ్రాన్‌లో ఎవిన్ జైలులో నిర్బంధింపబడి ఉంది. ఇక ఈ టైమ్స్ ప్రతిభావంతమైన వ్యక్తుల జాబితాలో ఈ జాబితాలో రెజ్లర్ సాక్షి మాలిక్ , సత్య నాదెళ్లకు కూడా చోటు దక్కించుకున్నారు. (చదవండి: సోషల్ మీడియా క్రేజ్ కోసం ఓ తండ్రి పసికందుపై పిచ్చి ప్రయోగం! చివరికి..) -
జాక్ మాకు మరో షాక్!
బీజింగ్: చైనా ఈ కామర్స్ దిగ్గజం అలీబాబా గ్రూప్ వ్యవస్థాపకుడు జాక్ మాకు తాజాగా మరో షాక్ తగిలింది. దేశ అధికారిక రాష్ట్ర మీడియా ప్రచురించిన టాప్ బిజినెస్ లీడర్స్ జాబితా నుంచి అలీబాబాను తప్పించడం సంచలనం రేపింది. దేశంలో సాంకేతిక విప్లవానికి నాంది పలికిన ప్రముఖ వ్యాపారవేత్తలను ప్రశంసించిన షాంఘై సెక్యూరిటీస్ పత్రిక కీలకమైన ప్రముఖ టెక్ దిగ్గజం అలీబాబాను విస్మరించింది. చైనా ప్రభుత్వ మీడియా సంస్థ షింజువా ఏజెన్సీకి చెందిన షాంఘై సెక్యూరిటీస్ న్యూస్ దేశంలోని టెక్ దిగ్గజాలపై స్టోరీ ప్రచురించింది. ఇందులో టెక్ సంస్థలు, టెక్ కంపెనీల అధినేతల కృషి, అభివృద్ధి గురించి ప్రముఖంగా పేర్కొంది. అయితే ఈ కామర్స్ దిగ్గజం అలీబాబా, దాని వ్యవప్థాపకుడు జాక్ మా ప్రస్తావన లేదు. మరోవైపు కొత్త మొబైల్ యుగాన్ని లిఖించాడంటూ జాక్ మా ప్రధాన ప్యత్యర్థి, టెన్సెంట్ సీఈవో పోనీమాపై ప్రశంసలు కురిపించడం విశేషం. టెన్సెంట్తో పాటు బివైడి కో చైర్మన్ వాంగ్ చవాన్ వూ, షావోమీ లీ జూన్, హువావే అధినేత తదితరులను పొగడ్తలతో ముంచెత్తింది. మొదటి పేజీ వ్యాఖ్యానంలో జాక్ మా పేరును కావాలనే పక్కన పెట్టిన పత్రిక "మన పాత ఆర్థిక వ్యవస్థ కఠినమైన విధానాలను బ్రేక్ చేయడానికి కొంతమంది వ్యవస్థాపకులు "నిర్లక్ష్య వీరులు" గా వ్యవహరించా రంటూ రాసుకొచ్చింది. కాగా గతేడాది 2020 , అక్టోబర్ 24 వ తేదీన జాక్ మా చైనా ప్రభుత్వంపై కొన్ని విమర్శలు గుప్పించారు. దీంతో జాక్‌మాకు చెందిన యాంట్ గ్రూప్ 37 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 2,77,000 కోట్లు) ఐపీవోను నిలిపివేసిన చైనాప్రభుత్వం యాంట్ గ్రూపుతోపాటు అలీబాబాపై యాంటీ ట్రస్ట్ దర్యాప్తును ప్రారంభించింది. ఆ తరువాత నెలల తరబడి అజ్ఞాతంలో ఉన్న జాక్ మా, గతనెల జనవరిలో దర్శనమిచ్చిన సంగతి తెలిసిందే. 2019 లో అలీబాబా చైర్మన్ పదవి నుంచి వైదొలిగిన అలీబాబా డైరెక్టర్ల బోర్డులో ఉన్నారు. అలీబాబా తన త్రైమాసిక ఆదాయాలను ఈ రోజు ప్రకటించనుంది. తాజా పరిణామంపై అలీబాబా ఇంకా స్పందించలేదు. -
‘ప్రతీ ఇంటిముందు పోలీసును పెట్టలేం కదా’
ముంబై: ఉత్తరప్రదేశ్ సహా దేశవ్యాప్తం గా మహిళలపై జరుగుతున్న నేరాలకు సంబంధించి నోరు పారేసుకుంటున్న నేతల జాబితాలోకి తాజాగా మహారాష్ట్ర హోంమంత్రి ఆర్ఆర్ పాటిల్ చేరారు. ‘మహిళలపై రేప్‌లు, ఇతర నేరాలు సాధారణంగా ఇళ్లల్లోనే జరుగుతుంటా యి. అందుకని ప్రతీ ఇంటిముందు ఒక పోలీసును నిలబెట్టగలమా!.. అది సా ద్యమేనా’ అంటూ కొత్త లాజిక్‌ను తెరపైకి తెచ్చారు. సమాజంలో నైతిక విలువలు దిగజారడం వల్లనే అత్యాచారం లాంటి నేరాలు పెరుగుతున్నాయన్నా రు. మహిళలపై పెరుగుతున్న నేరాలకు సంబంధించి బుధవారం మహారాష్ట్ర శాసనమండలిలో జరిగిన చర్చ సందర్భంగా పాటిల్ ఈ వ్యాఖ్య లు చేశారు. వీటిపై విమర్శలు వెల్లువెత్తడంతో.. తన మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారంటూ వివరణ ఇచ్చారు.