బ్రిటన్లో నాలుగింతలు పెరిగిన లెస్బియన్లు!
బ్రిటన్లో ఆడ స్వలింగ సంప్కరులు(లెస్బియన్లు) సంఖ్య దశాబ్దకాలంలో నాలుగింతలు పెరిగినట్టు అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. పురుష స్వలింగ సంప్కరులు(గే) సంఖ్యలో మాత్రం పెద్దగా మార్పు లేదని లైంగిక ప్రవర్తన, జీవనశైలిపై జరిపిన జాతీయ సర్వేలో వెల్లడయింది.
శృంగారం విషయంలో మహిళలు సాహసోపేతంగా వ్యవహరిస్తున్నారని.. ప్రయోగాలకు వెనుకాడడం లేదని.. లైంగిక విజ్ఞానం పట్ల వారికి అవగాహన అధికంగానే ఉందని తేలింది. 1990లో లెస్బియన్లు 4 శాతం ఉండగా 2010 నాటికి ఈ సంఖ్య 16 శాతానికి పెరిగింది. వీరిలో 8 శాతం మంది తమ భాగస్వాములతో లైంగిక సంబంధాలు కొనసాగిస్తున్నట్టు వెల్లడించారు.
ఇక పురుష స్వలింగ సంప్కరులు సంఖ్య దశాబ్దకాలంలో ఒక శాతం మాత్రమే పెరిగింది.1990లో ఇది 6 శాతంగా ఉంది. బ్రిటన్లో లెస్బియన్లు సంఖ్య పెరుగుతుండడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయంలో స్రీలు స్వేచ్ఛగా వ్యవహరిస్తున్నారని కొందరు అంటుంటే, వైవిధ్యం కోరుకుంటున్నారని మరికొందరు అంటున్నారు.