సమ్మెకు దిగిన ఎల్ఎన్టీ ఉద్యోగులు
సంగారెడ్డి మున్సిపాలిటీ, న్యూస్‌లైన్: వేతనాలు చెల్లించడం లేదని ఆరోపిస్తూ ఎల్ఎన్టీ ఉద్యోగులు సోమవారం సమ్మెకు దిగారు. దీంతో జిల్లా వ్యాప్తంగా 250 గ్రామాలకు పూర్తిగా మంచినీటి సరఫరా నిలిచిపోయింది. ఆర్డబ్ల్యూఎస్ఎస్ఈ సురేశ్‌కుమార్ సమక్షంలో కార్మికులతో ఎల్ఎన్టీ ప్రతినిధు లు జరిపిన చర్చలు విఫలం కావడంతో సమ్మె కు దిగారు.
సత్యసాయి నీటి సరఫరా పథకం కింద జిల్లాలోని పటాన్చెరు, గజ్వేల్, బొంతపల్లి, జిన్నారం, జగదేవ్‌పూర్, దుబ్బాక, రా మక్కపేట, అందోల్, పుల్కల్, హత్నూర, నర్సాపూర్ మండలాల పరిధిలోని గ్రామాలకు ఎల్ఎన్టీ యాజమాన్యం కాంట్రాక్టు తీసుకుని నీటి సరఫరా చేస్తున్నారు. ఈ సంస్థ లో 12 ఏళ్లుగా 135 మంది కార్మికులు పనిచేస్తున్నారు. 2012 జూలై 31కి సంస్థ ఏరియర్స్ 28 లక్షలు కార్మికులకు ఇంతవరకు చెల్లించలేదు. దీంతో వారు సమ్మెబాట పట్టారు. త మ సమస్యలను పరిష్కరించాలని ఆగస్టు 5న కార్మికశాఖ అధికారుల సమక్షంలో విజ్ఞప్తి చే సినా పట్టించుకోకపోవడంతో యాజమాన్యం తో చర్చలు జరిపామని, అయినా స్పష్టమైన హామీ రాకపోవడంతో సమ్మెకు దిగామని కా ర్మిక యూనియన్ అధ్యక్ష, కార్యదర్శులు కొం డల్‌రెడ్డి, దండు ప్రభులు తెలిపారు. వేతనా లు చెల్లించే వరకు సమ్మె విరమించమన్నారు.