వేశ్యావాటికపై దాడులు
ముగ్గురి అరెస్ట్, విదేశీ యువతికి విముక్తి
బెంగళూరు(బనశంకరి) : నందిదుర్గ రోడ్డులో ఉన్న ఓ ఇంటిలో నిర్వహిస్తున్న వేశ్యావాటికపై బుధవారం ఉదయం సీసీబీ పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులైన కోల్‌కత్తాకు చెందిన సుమనాసహ, పరిమల్పాల్, మండ్యకు చెందిన వినయ్‌ను అరెస్ట్ చేశారు. ఉజ్జెకిస్తాన్‌కు చెందిన యువతిని సంరక్షించి పునరావాస కేంద్రానికి తరలించారు. నిందితులు ఉద్యోగాల పేరుతో విదేశీ యువతులను ఆకర్షించి వ్యభిచారం ఉబిలోకి దింపినట్లు విచారణ లో వెలుగుచూసిందని పోలీసులు తెలిపారు. నిందితులపై జయమహాల్ పోలీస్‌స్టేషన్ లో కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
కమర్షియల్ స్ట్రీట్‌లో....
వేశ్యావాటిక నిర్వహిస్తున్న కమర్షియల్స్ట్రీట్లోని వీరపిళ్లైస్ట్రీట్లో గ్రీన్బ్లాసమ్ మసాజ్ పార్లర్‌పై బుధవారం సీసీబీ పోలీసులు దాడి చేశారు. అయ్యప్పనగర కు చెందిన సందీఫ్, వేణుగోపాల్పుర నివాసి హరీశ్, మదర్సాహేబ్ లేఔట్ వాసి శ్యామ్,, బసరాళు నివాసి సంతోష్, సంతకెరెహళ్లికి చెందిన నవీన్, యరప్పగార్డెన్ నివాసి ప్రవేశ్, బీటీఎం లేఔట్ కు చెందిన మహమ్మద్తబ్రేజ్ను అరెస్ట్ చేశారు. పశ్చిమబెంగాల్‌కు చెందిన నలుగురి మహిళలను కాపాడారు. ఉద్యోగం పేరుతో యువతులను నగరానికి తీసుకువచ్చి వేశ్యావాటిక నిర్వహిస్తున్నట్లు విచారణలో నిందితులు వెల్లడించారని పోలీసులు తెలిపారు.
పేకాట కేంద్రం పై దాడి
ఎస్జే.పార్కులో పేకాట నిర్వహిస్తున్న కేంద్రంపై బుధవారం సీసీబీ పోలీసులు దాడిచేసి ఆలం అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఇతడి వద్ద నుంచి రూ.5840 నగదు, పేకాటకు వినియోగించే 30 స్లిప్‌లను స్వాధీనం చేసుకొని నిందితులపై ఎస్జే.పార్కు పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేసినట్లు డీసీపీ. గిరీష్ తెలిపారు.