మనల్ని మనవాడిలా పాలించాడు!
భారతదేశాన్ని పరిపాలించిన బ్రిటిష్ జనరళ్లు, వైశ్రాయ్లంటే మనకు సదభిప్రాయం ఉండదు. కానీ లార్డు విలియం బెంటింక్ గా ప్రసిద్ధి చెందిన విలియం హెన్రీ కావెండిష్ బెంటింక్ బ్రిటిష్ ఈస్టు ఇండియా కంపెనీకి గవర్నర్ జనరల్ గా భారతదేశాన్ని ఒక భారతీయుడిగానే 1828–1835 మధ్య పరిపాలించారు! ఆయన ఉదార రాజనీతిజ్ఞుడు.
స్వాతంత్య్ర పిపాసి. ‘‘నోరులేని జనసామాన్యం అజ్ఞానులుగా ఉండటం చూసి, ఆ అజ్ఞానాన్ని చిరస్థాయిగా చేసి, దానివల్ల అక్రమలాభాలను పొందడమే ఈ ప్రభుత్వ (ఈస్టిండియా ప్రభుత్వం) లక్ష్యం అనే తలంపు బ్రిటిష్ నీతికి, ధర్మానికి విరుద్ధం’’ అని బెంటింక్ తరచు అంటుండం మాత్రమే కాదు, పాఠశాలలను విరివిగా స్థాపించి భారతదేశంలో విద్యాభివృద్ధికి కృషి చేశారు. ప్రముఖ బ్రిటిష్ రాజ్యాంగవేత్త అయిన సర్ జార్జి ట్రవెలియాన్.. 1853లో బ్రిటిష్ పార్లమెంటులోని హౌస్ ఆఫ్ లార్డ్లో ప్రసంగిస్తూ, భారతీయుల క్షేమం, సంక్షేమం కోసమే çపరిపాలన జరిపిన ఘనత విలియం బెంటింక్కు ఇవ్వక తప్పదు అని ప్రశంసించారు. విలియం బెంటింక్ (1774–1839) జూన్ 17న మరణించారు.