రష్యా అధ్యక్షుడు పుతిన్ కు విడాకులు మంజూరు!
మాస్కో: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కు విడాకులు మంజూరైనట్టు క్రెమ్లిన్ ధృవీకరించింది. విభేదాలు తలెత్తడంతో భార్య ల్యూడ్మిలా అలెకస్సాంద్రోనా పుతినా, పుతిన్ లు గత వేసవిలో విడిపోయారు. మూడు దశాబ్దాల వైవాహిక జీవితానికి తెరదించుతున్నామని గత సంవత్సరం జూన్ లో పుతిన్ దంపతులు షాకింగ్ న్యూస్ ఇచ్చారు.
కనీసం ఒకరికొకరం చూసుకోలేకపోతున్నాం. వైవాహిక జీవితానికి అర్ధం లేదని పుతినా చెప్పినట్టు పుతిన్ వెల్లడించారు. దాంతో ఇద్దరం చట్టబద్దంగా విడిపోవడానికి సిద్దపడ్డామని పుతిన్ ఓ ప్రకటనలో తెలిపారు. అప్పటి నుంచి పబ్లిక్ లైఫ్ కు పుతినా దూరంగా ఉంటున్నారు. పుతిన్ దంపతులకు ఇద్దరు కుమార్తెలున్నారు.
తాను ఇక దేశ ప్రథమ పౌరురాలు కాదని పుతినా వెల్లడించింది. పుతినా, పుతిన్ లకు విడాకులు మంజురైనట్టు అధ్యక్ష భవన అధికార ప్రతినిధి మిత్రి పెస్కోవ్ టాస్ న్యూస్ ఏజెన్సీకి తెలిపారు. అయితే ఒలంపిక్ జిమ్నాస్టిక్ క్రీడాకారిణి, పార్లమెంట్ సభ్యురాలు అలినా కబయేవాతో పుతిన్ అఫైర్ నడుపుతున్నారని రూమర్లు వచ్చిన సంగతి తెలిసిందే.