శ్రీకృష్ణాష్టమి వేడుకల్లో అపశ్రుతి
- ఉట్టికొడుతుండగా కిందపడిపోయిన యువకులు
- ముగ్గురికి గాయాలు
తాండూర్ : శ్రీకృష్ణాష్టమి వేడుకల్లో అపశ్రుతి చోటు చేసుకుంది. మాదారం టౌన్షిప్లో ఆదివారం శ్రీ కృష్ణాష్టమి వేడుకల్లో భాగంగా ఉట్టి కొట్టే కార్యక్రమం నిర్వహించారు. తాడుకు కట్టిన ఉట్టిని కొట్టేందుకు కొంతమంది యువకులు మానవ పిరమిడ్ ఏర్పాటు చేశారు. ఉట్టిని అందుకునే క్రమంలో అదుపుతప్పి ఒకరిపై ఒకరు పడిపోయూరు. నల్లవెల్లి రవి, జటారి రమేశ్, అన్వేష్లకు ఉపిరి ఆడక అపస్మారక స్థితిలోకి వెళ్లారు. వారిని వెంటనే స్థానికులు మాదారం సింగరేణి ఆస్పత్రికి తీసుకెళ్లారు. ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం 108 వాహనంలో మంచిర్యాలకు తరలించారు.