మేడ్ ఇన్ స్పేస్..
‘మేడ్ ఇన్ స్పేస్’, ‘నాసా’ ఆంగ్ల పదాలను అమర్చిన ఈ బోర్డు అంతరిక్షంలో త్రీడీ ప్రింటర్ ద్వారా తయారు చేసిన తొలి వస్తువు. భూమి చుట్టూ 400 కి.మీ. ఎత్తులోని కక్ష్యలో తిరుగుతున్న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్)లో సోమవారం సృష్టించిన దీనిని ఐఎస్ఎస్ కమాం డర్ బ్యారీ విల్మోర్ ఇలా ప్రదర్శించారు.
ఇటీవలే ఐఎస్ఎస్కు నాసా శాస్త్రవేత్తలు ప్రయోగాత్మకంగా పరీక్షించేందుకు ఒక జీరో గ్రావిటీ త్రీడీ ప్రింటర్‌ను పంపారు. అయితే, గురుత్వాకర్షణ లేమి వల్ల ఐఎస్ఎస్లో ఈ త్రీడీ ప్రింటర్ ప్రింట్ చేస్తున్న ప్లాస్టిక్ వస్తువులు ప్రింటింగ్ పలకకు గట్టిగా అతుక్కుపోతున్నాయట.
ప్రస్తుతం దీనితో ప్రయోగాలు తొలిదశలోనే ఉన్నా.. భవిష్యత్తులో అనేక వస్తువులను అక్కడే తయారు చేసుకోవచ్చని, చంద్రుడు ఇతర గ్రహాలపై మట్టితో ఇటుకలు తయారుచేసి వాటితో ఇళ్లు సైతం నిర్మించుకోవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.