దక్షిణాఫ్రికాపై చరిత్ర సృష్టించిన మహ్మదుల్ హసన్.. తొలి ఆటగాడిగా!
డర్బన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో బంగ్లాదేశ్ బ్యాటర్ మహ్మదుల్ హసన్ జాయ్ చరిత్ర సృష్టించాడు. తొలి ఇన్నింగ్స్‌లో మహ్మదుల్ హసన్ అద్భుతమైన సెంచరీ సాధించాడు. దీంతో టెస్టుల్లో దక్షిణాఫ్రికాపై సెంచరీ సాధించిన తొలి ఆటగాడిగా మహ్మదుల్ బంగ్లాదేశ్ ఆటగాడిగా రికార్డులకెక్కాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో 326 బంతుల్లో 137 పరుగులు సాధించాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. బంగ్లాదేశ్‌పై 220 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికా ఘన విజయం సాధించింది.
274 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ 53 పరుగులకే కుప్పకూలింది. ప్రోటీస్ స్పిన్నర్ కేశవ్ మహరాజ్ 7 వికెట్లు పడగొట్టి బంగ్లాదేశ్‌ను దెబ్బ తీశాడు. కాగా కింగ్స్‌మీడ్ మైదానంలో(డర్బన్) టెస్టుల్లో అత్యంత తక్కువ స్కోరుకే ఆలౌటైన జట్టుగా బంగ్లాదేశ్ నిలిచింది. ఇంతకముందు డర్బన్‌లో టీమిండియా 66 పరుగులకే ఆలౌటైంది.
స్కోర్లు:
దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్: 367/10
బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్: 298/10
దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్: 204/10
బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్: 53/10
చదవండి: SA vs BAN: భారత్ పేరిట ఉన్న చెత్త రికార్డు బంగ్లాకు బదిలీ.. ప్రొటీస్ అద్భుత విజయం