ప్రణాళికాబద్ధంగా ఏర్పాట్లు చేయండి
అనంతపురం అర్బన్: జిల్లాలో జరుగుతున్న రాష్ట్ర స్థాయి 70వ స్వాతంత్య్ర దినోత్సవ ఏర్పాట్లు ప్రణాళికాబద్ధంగా చేయాలని అధికారులకు కలెక్టర్ కోన శశిధర్ సూచించారు. ఏర్పాట్లపై బుధవారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా ఎస్సీ రాజశేఖర్‌బాబుతో కలిసి అధికారులతో సమీక్షించారు. గతంలో కర్నూలు, విశాఖపట్నంలో జరిగిన స్వాతంత్య్ర వేడుకలను సీడీ ద్వారా వీక్షించారు. అనంతరం పీటీసీలో జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించారు. సిబ్బందికి తగిన సూ^è నలను ఇచ్చారు. అప్పగించిన బాధ్యతలను పూర్తి స్థాయిలో నిర్వర్తించాలని ఆదేశించారు. దాదాపు ఎనిమిది నుంచి పది వేల మంది వేడుకల్లో పాల్గొనే అవకాశం ఉందన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి, జాయింట్ కలెక్టర్ బి.లక్ష్మీకాంతం, జేసీ–2 సయ్యద్ ఖాజామొహిద్ధీన్, డీఐజీ ప్రభాకర్‌రావు, బెటాలియన్ డీఐజీ ప్రసాద్‌బాబు, కమాండెంట్ విజయకుమార్, డీఆర్ఓ మల్లీశ్వరిదేవి