Mam
-
శ్రీదేవితో సిల్వర్ జూబ్లీ సినిమా తీయాలనుంది
– రాఘవేంద్రరావు ‘‘ఇండియాలోని అన్ని జనరేషన్స్‌కి తెలిసిన ఒకే ఒక్క పేరు శ్రీదేవి. బాల నటì గా మొదలైన తన కెరీర్ ‘మామ్’ చిత్రం వరకూ సాగడమంటే మామూలు విషయం కాదు. శ్రీదేవితో 24 సినిమాలు చేసిన ఏకైక దర్శకుణ్ణి నేనే. కోన వెంకట్ కథ అందించి, సురేశ్‌బాబు ఫైనాన్స్ చేసి శ్రీదేవి డేట్స్ ఇస్తే తనతో సిల్వర్ జూబ్లీ మూవీ చేస్తాను’’ అన్నారు దర్శకుడు కె.రాఘవేంద్రరావు. శ్రీదేవి టైటిల్ రోల్లో రవి ఉద్యవార్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘మామ్’ చిత్రం ట్రైలర్‌ను హైదరాబాద్‌లో విడుదల చేశారు. రాఘవేంద్రరావు మాట్లాడుతూ– ‘‘ఏదైనా సినిమా బాగుందని తెలిస్తే వెళతాం. కానీ, శ్రీదేవి సినిమాలో ఉందని తెలిస్తే ఆలోచించకుండా వెళ్తాం. ఎందుకంటే తను గ్లామర్‌గా ఉంటుంది. యాక్టింగ్, డ్యాన్స్ బాగా చేస్తుంది కాబట్టి’’ అన్నారు. నిర్మాత డి.సురేశ్‌బాబు మాట్లాడుతూ– ‘‘శ్రీదేవిగారితో మా నాన్నగారు దేవత, ముందడుగు, తోఫా వంటి చిత్రాలు తీసారు. అప్పడు నేను పక్కన నిలబడి చూస్తుండేవాణ్ని. ఆమె సూపర్‌స్టార్. ప్రేక్షకులకు డ్రీమ్ గర్ల్. ‘మామ్’ రషెష్ చూశా. ఎక్సలెంట్‌గా నటించారు’’ అన్నారు. ‘‘బోనీ కపూర్ సినిమాల మేకింగ్‌లో లాభనష్టాలు చూసుకోడు.శ్రీదేవి అప్పట్లో ఎలా ఉండేవారో ఇప్పటికీ అలాగే ఉన్నారు’’ అన్నారు ‘కళాబంధు’ టి. సుబ్బరామిరెడ్డి. ‘‘దేవుడు అన్ని చోట్ల ఉండకుండా అమ్మను సృష్టిస్తాడనేది ఎంత నిజమో, ‘మామ్’ సినిమా చేయడానికి శ్రీదేవిగారిని క్రియేట్ చేశారనేది అంతే నిజం. జూలై 7న సినిమా విడుదల కానుంది’’ అని రచయిత కోన వెంకట్ అన్నారు. ‘‘నా జీవితానికి భార్య ఎంత ప్రాణమో ఈ సినిమాకు అంతే ప్రాణం. ఇప్పటి వరకు తను చేసిన పాత్రలన్నింటిని మించే పాత్ర ‘మామ్’’ అని నిర్మాత, శ్రీదేవి భర్త బోనీకపూర్ అన్నారు. శ్రీదేవి మాట్లాడుతూ – ‘‘మామ్’ ఎంత పెద్ద హిట్ అవుతుందనేది ప్రేక్షకులే నిర్ణయిస్తారు. ఓ నటిగా నాకు సంతృప్తినిచ్చింది. మా ఆయన ఇంత మంచి గిఫ్ట్ ఇవ్వడం నా అదృష్టం’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: ఎ.ఆర్.రెహమాన్, నిర్మాతలు: బోనీ కపూర్, సునీల్ మన్‌చందా, నరేష్ అగర్వాల్, ముఖేష్ తల్రేజా, గౌతమ్ జైన్. -
అమ్మలకు మామ్ అంకితం
ఇక్కడ మహిళకు రక్షణ కరువైందని అతిలోక సుందరిగా కొనియాడబడిన నాటి, నేటి మేటి నటి శ్రీదేవి వ్యాఖ్యానించారు. తమిళం, తెలుగు, హిందీ అంటూ పలు భాషల్లో కథానాయకిగా ఏలిన ఈ ఎవర్గ్రీన్ నటి బోనికపూర్‌తో వివాహానంతరం నటనకు దూరంగా ఉండి అనంతరం ఆ మధ్య ఇంగ్లిష్ వింగ్లీష్ చిత్రంతో రీఎంట్రీ అయ్యారు. ఆ చిత్ర విజయం శ్రీదేవితో మరింత ఆత్మవిశ్వాసాన్ని పెంచిందనే చెప్పాలి. తాజాగా మామ్ అనే చిత్రంతో మరోసారి ప్రపంచ వ్యాప్తంగా తరపైకి రావడానికి సిద్ధం అవుతున్నారు. విశేషం ఏమిటంటే ఇది శ్రీదేవి 300ల చిత్రం కావడం. తన భర్త బోనీకపూర్ నిర్మించిన ఈ హిందీ చిత్రం తమిళం, తెలుగులోనూ అనువాదరూపంలో త్వరలో విడుదల కానుంది. ఈ చిత్ర ప్రచారంలో భాగంగా మామ్ చిత్ర యూనిట్ గురువారం స్థానిక ప్రసాద్ ల్యాబ్‌లో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఇందులో పాల్గొన్న నటి శ్రీదేవి మాట్లాడుతూ స్త్రీలకు, అమ్మాయిలకు రక్షణ కరువైందన్నారు. ఆడ పిల్లలు బయటకు వెళితే తిరిగి వచ్చే వరకూ వారి తల్లులు గుండెలపై కుంపటి పెట్టుకున్నంతగా ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొందన్నారు.అలా తల్లీకూతుళ్ల అనుబంధాన్ని ఆవిష్కరించే చిత్రంగా మామ్ ఉంటుందన్నారు. ఇది యూనివర్శల్ కథాంశంతో తరకెక్కించిన చిత్రం అని తెలిపారు. ఇందులో తన కూతురు జాహ్నవి కూడా నటిచండం విశేషం అని అన్నారు.తాను జీవితంలో ఇంత ఉన్నత స్థాయికి చేరుకోవడానికి తన తల్లి రాజేశ్వరినే కారణంగా పేర్కొన్నారు.ఆమె తనను పెంచిన దానిలో 50 శాతం తాను తన పిల్లలను పెంచడమే గొప్ప అని అన్నారు. మాతృమూర్తులందరికీ మామ్ చిత్రాన్ని అంకితం చేస్తున్నట్లు అతిలోక సుందరి శ్రీదేవి పేర్కొన్నారు. ఏఆర్.రెహ్మాన్ సంగీతం మామ్ చిత్రానికి మరింతబలాన్ని చేకూర్చిందని వ్యాఖ్యానించారు.తమిళనాడు తనకు ఎంతో ప్రేమను, అభిమానాన్ని అందించిందన్నారు. సంగీత దర్శకుడు ఏఆర్.రెహ్మాన్ మాట్లాడుతూ మామ్ యూనివర్శల్ ఇతివృత్తంతో తెరకెక్కిన చిత్రం అని చెప్పారు. ఇందులో బ్యాగ్రౌండ్ సాంగ్స్ మాత్రమే ఉంటాయని తెలిపారు. చిత్ర నిర్మాత బోనీకపూర్ కూడా పాల్గొన్నారు. -
అంగారక కక్ష్యలోకి మామ్ ప్రవేశం
-
అంగారక కక్ష్యలోకి మామ్ ప్రవేశించిందిలా...
బెంగళూరు: తొలి ప్రయత్నంలో అంగారక కక్ష్యలోకి మార్స్ ఆర్బిటర్ మిషన్ (మామ్)ను ప్రవేశపెట్టిన మొట్టమొదటి దేశంగా భారత దేశం చరిత్ర సృష్టించింది. అంగారక గ్రహం ఉపరితలానికి 515 కిలో మీటర్ల దూరం, భూమికి 215 కిలోమీటర్ల దూరంలో మామ్ ను విజయవంతంగా ప్రవేశపెట్టడంలో భారత శాస్త్రవేత్తలు విజయం సాధించారు. మంగళవారం ఉదయం 4.17 నిమిషాలకు అంగారక కక్ష్యలోకి మామ్ ప్రవేశించడం జరిగింది. దాంతో రెడియో సిగ్నల్స్ రిసీవ్ చేసుకోవడానికి ఓ ప్రత్యేకమైన యాంటెనాను ఏర్పాటు చేశారు. అంగారక గ్రహం వైపు 6.57 నిమిషాలకు మామ్ దూసుకెళ్లడం ప్రారంభించింది. ఆ తర్వాత అంగారక కక్ష్యలోకి వెళ్లడానికి 7.17 నిమిషాలకు ప్రధాన ఇంజన్ పనిచేయడం ప్రారంభించింది. ఈ కీలక ఘట్టంలో 7.12 నిమిషాలకు అంగారక గ్రహంలో గ్రహణం ఏర్పడింది. 7.30 నిమిషాలకు ప్రధాన ఇంజన్ లోని 440 న్యూటన్ లిక్విడ్ అపోజి మోటర్ నిప్పులు గక్కుతూ పనిచేయడం ప్రారంభించింది. ఆతర్వాత 24 నిమిషాలకు అంటే 7.54 గంటలకు అంగారక గ్రహంలోకి మామ్ విజయవంతంగా ప్రవేశించింది. మామ్ ప్రయోగం విజయవంతమమైనట్టు యూఎస్, యూరప్, భారత్, ఆస్ట్రేలియాలో ఏర్పాటు చేసిన ఎర్త్ స్టేషన్లలోని రాడార్స్ కు సిగ్నల్ అందాయి.