Maneru riverfronts
-
మిడ్‌మానేరు వద్ద మంచు లక్ష్మి షూటింగ్
సాక్షి, కరీంనగర్: శ్రీరాజరాజేశ్వర(మిడ్‌మానేరు) ప్రాజెక్టు పరిసరాలు షూటింగ్ స్పాట్‌గా మారాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం మాన్వాడ మిడ్‌మానేరు ప్రాజెక్టు వెబ్ సిరీస్ పాటల చిత్రీకరణకు వేదికగా మారుతోంది. ప్రాజెక్టు డౌన్ స్ట్రీమ్, వరదకాలువ పరిసరాలతోపాటు, ప్రాజెక్టు బ్యాక్‌వాట ర్ ఏరియాలో ప్రముఖ టీవీ ఛానళ్లు సీరియల్స్ షూటింగ్ నిర్వహించడం విశేషం. పలువురు లోకల్ టాలెంట్ కళాకారులు, యూ ట్యూబ్ ఛానల్స్ వారు పలు జానద గేయాలు చిత్రీకరిస్తున్నారు. వరదకాలువ వద్ద మంచు లక్ష్మి షూటింగ్ గత జనవరి మొదటి వారంలో వెబ్ సిరీస్ ఆన్లైన్ షూటింగ్ నిమిత్తం ప్రముఖ నటుడు మోహన్‌బాబు కూతురు మంచు లక్ష్మితో దేశాయిపల్లి వరదకాలువ వద్ద షూటింగ్ నిర్వహించారు. దర్శకుడు తరుణ్ భాస్కర్ వరదకాలువపై నుంచి ఓ అమ్మాయి నీటిలో దూకే సీన్ చిత్రీకరించారు. ఇందులో మంచు లక్ష్మి గ్రామ పెద్ద పాత్ర పోషించారు. బ్యాక్ వాటర్ ఏరియాలో టీవీ సీరియళ్ల చిత్రీకరణ సందడి వారంక్రితం మిడ్‌మానేరు ప్రాజెక్టు ముంపు గ్రామం వరదవెల్లి బ్యాక్ వాటర్ పరిసరాల్లో మా టీవీ నిర్మిస్తున్న కస్తూరి సీరియల్ షూటింగ్ సందడి చేసింది. అగ్నిసాక్షి సీరియల్ ఫేం హీరోయిన్ ఐశ్వర్య, సూర్య, గౌతంరాజు నటించారు. వైద్యశిబిరం జరిగే సన్నివేశం చిత్రీకరించారు. మూడురోజులపాటు షూటింగ్ చేశారు. వారంక్రితం జరిగిన సీరియల్ షూటింగ్ దృశ్యం జానపద గీతాలు.. మిడ్‌మానేరు ప్రాజెక్టు పరిసరాల్లో లోకల్ టాలెంటెడ్ కళాకారులు పలు జానపద గీతాలు చిత్రీకరించారు. కరీంనగర్, వేములవాడ ప్రాంతాలకు చెందిన పలువురు జానపద కళాకారులు తమ టాలెంట్‌తో నిర్వహించే గీతాలు చిత్రీకరిస్తున్నారు. మండలంలోని కొదురుపాకకు చెందిన జానపద కళాకారుడు కత్తెరపాక శ్రీనివాస్ పలు ప్రేమ గీతాలతోపాటు, జానపద గీతాలు చిత్రీకరించారు. ప్రాజెక్టు అందాలు అద్భుతం మెరుగు యూట్యూబ్ ఛానల్ ఆధ్వర్యంలో నిర్మించిన సరియా.. సరియా.. అనే గీతంలో నటించా. ప్రాజెక్టు గేట్ల పరిసరాల్లో పాట చిత్రీకరించారు. గేట్ల మీదుగా నీరు వెళ్తుండగా సాంగ్‌లో నటించడం ఎంతో మధురానుభూతిని అందించింది. – అశ్రుత, నటి, హైదరాబాద్ ప్రాజెక్టు వద్ద సందడి మాన్వాడ వద్ద గల మిడ్‌మానేరు ప్రాజెక్టు పరిసరాలు షూటింగ్‌కు వేదికయ్యాయి. ప్రాజెక్టు గేట్లు, బ్యాక్ వాటర్ పరిసరాల్లో వివిధ యూట్యూబ్ ఛానల్స్ వారు పలు జానపద గీతాలు చిత్రీకరిస్తున్నారు. దీంతో ప్రాజెక్టు పరిసరాల్లో సందడి నెలకొంది. దీంతో గ్రామానికి సందర్శకుల తాకిడి పెరిగింది. – రామిడి శ్రీనివాస్, సర్పంచ్, మాన్వాడ -
బోవెరా అమర్‌రేహ
కరీంనగర్ : ప్రముఖ స్వాతంత్య సమరయోధుడు బోయినపల్లి వెంకటరామారావు(బోవెరా) అంత్యక్రియలు మంగళవారం ఘనంగా జరిగాయి. కరీంనగర్ శివారులోని మానేరు నదీతీరంలో ప్రభుత్వ లాంఛనాలతో అంతిమ వీడ్కోలు పలికారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అంత్యక్రియలకు హాజరై బోవేరాకు నివాళులర్పించారు. సీఎం కేసీఆర్ హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో మధ్యాహ్నం 12.10 గంటలకు కలెక్టరేట్లోని హెలిప్యాడ్‌కు వచ్చారు. ఆయన వెంట మంత్రులు ఈటెల రాజేందర్, టి.హరీశ్‌రావు, పెద్దపల్లి ఎంపీ బాల్కసుమన్ వచ్చారు. హెలిప్యాడ్ వద్ద కేసీఆర్‌కు ఎమ్మెల్యేలు, అధికారులు స్వాగతం పలికారు. అక్కడి నుంచి ప్రత్యేక కాన్వాయ్‌లో భగత్‌నగర్, రామచంద్రాపూర్‌కాలనీ, సిరిసిల్ల బైపాస్ మీదుగా మానేరు వద్ద గల స్వర్గధామ్ శ్మశాన వాటికకు చేరుకున్నారు. బోవెరా పార్థీవదేహం వద్ద పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పిం చారు. పోలీసులు గాల్లోకి మూడు రౌండ్లు కాల్పులు జరిపి నివాళులర్పించారు. అనంతరం బోవెరా కుటుంబసభ్యులను సీఎం పరామర్శించి, ఓదార్చారు. అక్కడినుంచి హెలిప్యాడ్‌కు వెళ్లి అనంతరం హైదరాబాద్ వెళ్లిపోయారు. బోవెరా అంత్యక్రియల్లో ఎంపీ బి.వినోద్‌కుమార్, జెడ్పీ చైర్పర్సన్ తుల ఉమ, ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, సోమారపు సత్యనారాయణ, దాసరి మనోహర్‌రెడ్డి, పుట్ట మధు, వొడితెల సతీశ్, టి.జీవన్‌రెడ్డి, బొడిగె శోభ, రసమయి బాలకిషన్, ఎమ్మెల్సీ భానుప్రసాద్‌రావు, నగర మేయర్ రవీందర్‌సింగ్, కలెక్టర్ ఎం.వీరబ్రహ్మయ్య, జేసీ సర్ఫరాజ్ అహ్మద్, ఆర్డీవో చంద్రశేఖర్, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఈద శంకర్‌రెడ్డి, మాజీ మంత్రి జి.రాజేశంగౌడ్, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, మాజీ ఎమ్మెల్యేలు బొమ్మ వెంకన్న, కఠారి దేవేందర్‌రావు, వుచ్చిడి మోహన్‌రెడ్డి పాల్గొన్నారు.