మాన్వాడ వెళ్లడానికి ఆధార్‌కార్డు
స్వగ్రామం వెళ్లడానికి పోలీసుల ఆంక్షలు
బోయినపల్లి: మధ్యమానేరు జలాశయం గండిపడడంతో ముందు జాగ్రత్తగా ఆదివారం మండలంలోని మాన్వాడవాసులను అధికారులు ఇళ్లు ఖాళీచేయించారు. సోమవారం నిర్వాసితులు తమ స్వగ్రామం వెళ్లడానికి చాలా తంటాలు పడాల్సివచ్చింది. సీఎం కేసీఆర్ వస్తున్నారనే నెపంతో పోలీసులు కొత్తపేటలో చెక్‌పోస్ట్ ఏర్పాటుచేశారు. అడుగడుగునా పహారా ఉంచారు. కొత్తపేట నుంచి మాన్వాడకు ఎవరినీ అనుమతించలేదు. చివరకు ఆధార్‌కార్డు చూపిన వారిని పోలీసులు తమ వాహనంలోనే గ్రామంలోకి తీసుకెళ్లారు. సొంత వాహనాలపై వెళ్లనీయలేదు. భద్రత పేరిట తమ స్వగ్రామం వెళ్లడానికి ఆధార్ కార్డు చూపాలనడం.. గ్రామంలోకి వెళ్లకుండా పోలీసులు ఆంక్షలు విధించడంపై మాన్వాడవాసులు అభ్యంతరం తెలిపారు.