ఉత్సాహం విలువ 23 లక్షలు!
ఓ లుక్కేస్తారా!
బాలీవుడ్ నటుడు షాహిద్ కపూర్ వచ్చే నెల పదవ తేదీన మీరా రాజ్‌పుత్‌ను పెళ్లి చేసుకోబోతున్నాడని బాలీవుడ్ కోడై కూస్తోంది. వీరి పెళ్లికి రెండు కుటుంబాల పెద్దలూ అంగీకరించారు. మే నెల 16వ తేదీన ఢిల్లీ, చత్తర్‌పూర్‌లో ఉన్న మీరా ఇంట్లో రోకా వేడుక జరిగినట్లు సమాచారం. ఆ వేడుకలో మీరా వేలికి షాహిద్ తొడిగిన ఉంగరం విలువెంతంటే... అక్షరాలా 23 లక్షల రూపాయలు. ఈ ఉంగరాన్ని ప్రత్యేకంగా ఆర్డర్ ఇచ్చి తయారు చేయించాట్ట. పెళ్లి వార్తలను మీరా నిర్ధారించకముందే షాహిద్ పెళ్లి పనులు మొదలు పెట్టేసి తెగ ఉత్సాహంగా గడిపాడు. ఆ ఉత్సాహంలో ఇదో భాగం.