పోరాడి ఓడాడు
పురుషుల సింగిల్స్ బ్యాడ్మింటన్‌లో భారత నంబర్‌వన్ కిడాంబి శ్రీకాంత్ పోరాటం ముగిసింది. చైనా దిగ్గజం లిన్ డాన్‌తో బుధవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో శ్రీకాంత్ 6-21, 21-11, 18-21తో పోరాడి ఓడిపోయాడు. ‘హ్యాట్రిక్’ స్వర్ణంపై గురి పెట్టిన లిన్ డాన్ తొలి గేమ్‌లో పూర్తి ఆధిపత్యం చలాయించాడు. శ్రీకాంత్ షటిల్‌ను పలుమార్లు నెట్‌కు కొట్టి పాయింట్లు సమర్పించుకున్నాడు. అయితే రెండో గేమ్‌లో శ్రీకాంత్ అనూహ్యంగా పుంజుకున్నాడు. నమ్మశక్యంకానిరీతిలో ఆడుతూ లిన్ డాన్‌ను ముప్పుతిప్పలు పెట్టి గేమ్‌ను సొంతం చేసుకున్నాడు. నిర్ణాయక మూడో గేమ్‌లో శ్రీకాంత్ ఒకదశలో ఆధిక్యంలోకి వెళ్లినా లిన్‌డాన్ తన అనుభవాన్నంతా రంగరించి పోరాడి విజయాన్ని సాధించి ఊపిరి పీల్చుకున్నాడు.