Mental disabled
-
ఐ యామ్ ఏబుల్.. వైకల్యాన్నే కాదు, మా నైపుణ్యాలనూ చూడండి..!
మానసిక, శారీరక వైకల్యాలున్న పిల్లలను ఎవరో ఒకరు ప్రత్యేకంగా చూసుకోవాల్సి ఉంటుంది. ఒకరి మీద ఆధారపడే ఈ పిల్లలు.. ‘వైకల్యాన్నే కాదు... మా నైపుణ్యాలనూ చూడండి మేమూ కొన్ని సాధించగలం’ అని చేసి చూపుతున్నారు. ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలు తమంతట తాము చక్కగా సొంతంగా చక్కగా చదువుకోవడమేగాక, తమ భవిష్యత్‌ను తీర్చిదిద్దుకునే క్రమంలో ‘ఐ యామ్ ఏబుల్’ అంటూæడబ్బు కూడా సంపాదిస్తున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ‘ఐ యామ్ ఏబుల్’ అనే హ్యాండిక్రాఫ్ట్స్ ఆన్లైన్ స్టోర్ సంచలనాలు సృష్టిస్తోంది. మానసిక, శారీరక వైకల్యం ఉన్న పిల్లలు కొన్ని వస్తువులను తయారు చేసి ఈ స్టోర్‌లో విక్రయిస్తున్నారు. వివిధ రకాల ఉత్పత్తుల తయారీ నుంచి బిల్లింగ్ చేసేంత వరకు అన్ని పనులు వారే చూసుకోవడం విశేషం. ఇటీవల డెభ్బై జార్లు కావాలని ఓ కార్పొరేట్ సంస్థ నుంచి ఆర్డర్ రావడంతో విజయవంతంగా జార్లను డెలివరీ చేశారు. వీరి సామర్థ్యాలను చూసిన వారంతా అభినందనలతో ముంచెత్తుతున్నారు. దీంతో ఈ పిల్లలంతా పట్టరాని సంతోషంతో చిందులు వేస్తున్నారు. జినీషా.. వయసు వచ్చినా ఇంకా పసినవ్వులను చిందిస్తోన్న అభం శుభం తెలియని దివ్యాంగ బాలలకు తోడుగా నేనున్నానంటూ వెన్నుతట్టి వెనుక ఉండి నడిపిస్తోంది జినీషా ఛేదా. ముంబైలోని స్పెషల్లీ ఏబుల్డ్ చిల్డ్రన్ స్కూల్ ‘జిన్శిక్షా’ను నడుపుతోన్న జినీషా.. రకరకాల యాక్టివిటీల్లో బిజీగా ఉండే పిల్లలకు ఉపాధి కల్పించాలనుకుంది. తన స్కూలు సభ్యులతో చర్చించి.. పిల్లలు ఉత్పత్తి చేస్తోన్న వస్తువులతో కేఫ్ లేదా సూపర్ మార్కెట్ ప్రారంభించాలనుకుంది. కానీ ఈ రెండింటి ఏర్పాటుకూ చాలా ఖర్చు అవుతుంది. అందువల్ల తక్కువ ఖర్చులో ఏం చేయాలి అని ఆలోచించి గతేడాది డిసెంబర్లో ‘ఐ యామ్ ఏబుల్’ పేరిట ఆన్లైన్ స్టోర్‌ను ప్రాంభించింది. ఉత్పత్తుల తయారీ నుంచి బిల్లింగ్ వరకు అన్ని పనులు పిల్లలే చూసుకునే విధంగా ఏర్పాట్లు చేసింది. దీనిద్వారా పిల్లల్లో ఉద్యోగ అనుభవంతో పాటు ఉపాధిని కల్పిస్తోంది. హ్యాండీక్రాఫ్ట్స్‌ను తయారు చేసిన ప్రతి ఒక్కరికి జీతం కూడా ఇస్తోంది. పిల్లల ఉత్పత్తులను మార్కెట్లో ప్రవేశపెట్టి వీళ్లు కూడా కొన్ని చేయగలరు అని ప్రపంచం ముందు ఉంచడమే లక్ష్యంగా పనిచేస్తోన్న జినీషా.. ప్రస్తుతం ముంబైలో మాత్రమే ఉన్న ఈ స్టోర్‌ను దేశవ్యాప్తంగా విస్తరించడానికి ప్రయత్నిస్తోంది. -
సీఎం దృష్టికి మానసిక వికలాంగుల సమస్య
ఎంపీ వినోద్‌కుమార్ తిమ్మాపూర్ : మానసిక వికలాంగుల సమస్యను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల ద్వారా ఆర్థికసాయం అందేలా చూస్తానని కరీంనగర్ ఎంపీ వినోద్‌కుమార్ అన్నారు. ఎల్ఎండీ కాలనీలో స్వాతంత్య్ర సమరయోధుల ట్రస్టు ఆధ్వర్యంలోని మానసిక వికలాంగుల పాఠశాల రజతోత్సవాలు ఆదివారం ముగిశారుు. ఈసందర్భంగా ఎంపీ మాట్లాడారు. మానసిక వికలాంగులను అన్నివిధాలా తీర్చిదిద్దుతున్నా స్వాతంత్య్రసమరయోధులు అభినందనీయులన్నారు. అయతే, స్వచ్ఛంద సంస్థలు నిధులు దుర్వినియోగం చేస్తున్నాయనే కారణంతో మోదీ ప్రభుత్వం నిధులు విడుదల చేయడం లేదన్నారు. అయినా, త్వరలోనే పాఠశాల బడ్జెట్ ఇప్పిస్తానని మామీ ఇచ్చారు. మానసిక వికలాంగులు పుట్టకుండానే ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రధానంగా మేనరికం వివాహాలు చేసుకోవద్దని, ఈవిషయంపై ప్రభుత్వాలు ఇప్పటికే విస్తృత ప్రచారం చేశాయన్నారు. మంచిముహూర్తం పేరిట గడువు ముందు కొందరు ఆపరేషన్ల ద్వారా శిశువులకు జన్మనిస్తున్నారని, ఇలాంటివి సైతం మానసిక వైకల్యానికి దారితీస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు. పాఠశాలలో పని చేస్తున్న ఉద్యోగులకు త్వరలోనే శుభవారత వినిపిస్తానని చెప్పారు. కాగా, తాను డిజిటల్ సిస్టమ్స్, హార్డ్‌వేర్ అందిస్తానని అల్ఫోర్స్ కళాశాల చైర్మన్ నరేందర్‌రెడ్డి హామిచ్చారు. అనంతరం క్రీడా విజేతలకు బహుమతులు అందజేశారు. ఈసందర్భంగా చేపట్టిన సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నారు. ట్రస్టు అధ్యక్షుడు చాడ వెంకటరెడ్డి అధ్యక్షత వహించగా టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు మారం జగదీశ్వర్, జెడ్పీటీసీలు ఉల్లెంగుల పద్మ, తన్నీరు శరత్‌రావు, వైస్ ఎంపీపీ పొన్నాల భూలక్ష్మి, సర్పంచ్ మాతంగి స్వరూప, వైద్యుడు భూంరెడ్డి, కేడీసీసీబీ ఉపాధ్యక్షుడు ఉచ్చిడి మోహన్‌రెడ్డి, ప్రిన్సిపాల్ పద్మావతి, ఉద్యోగ సంఘం నాయకులు లక్ష్మణ్‌రావు, మామిడి రమేశ్, గంగారపు రమేశ్, పోలు కిషన్, సీపీఐ జిల్లా కార్యదర్శి రాంగోపాల్‌రెడ్డి, ట్రస్మా అధ్యక్షుడు శేఖర్‌రావు, స్వాతంత్య్ర సమరయోధులు, నాయకులు మధుసూదన్‌రావు, జనార్దన్‌రావు, వెంకటయ్య, ఎల్లారెడ్డి, బాపురెడ్డి, మల్లేశం, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.