ఇంటి పైకప్పు కూలి ఐదుగురు మృతి
డెహ్రాడూన్: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఉత్తరాఖండ్లో ఓ ఇంటి పై కప్పు కూలిపోయి ఐదుగురు మృతిచెందారు. ఒకరు గాయాలపాలయ్యారు. చనిపోయిన ఐదుగురు అదే ఇంటి వారు కావడంతో తీవ్ర విషాదం అలుముకుంది. రాష్ట్రంలోని పౌరి జిల్లాలో కొద్ది రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ జిల్లాలోని మేరా అనే గ్రామంలో ఓ కుటుంబీకులంతా తమ ఇంట్లో గాడ నిద్రలో ఉండగా ఒక్కసారిగా అర్థరాత్రి ఆ ఇంటి పైకప్పు కూలి మీదపడింది. చనిపోయిన వారిలో ఇంటి యజమాని ఆయన భార్య, ఇద్దరు కూతుర్లు, ఒక కుమారుడు మరొకరు చనిపోగా.. భార్యకు తీవ్ర గాయాలయ్యాయి.