million dollar reward
-
5 ఏళ్లైనా వీడని దంపతుల డెత్ మిస్టరీ..హంతకుడి తలపై ఏకంగా 300 కోట్లు
ఇద్దరు కెనడియన్బిలినియర్ దంపతులు 5 ఏళ్ల క్రితం అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. మొదట్లో ఆత్మహత్య చేసుకున్నారని భావించారు అంతా. ఆ తర్వాత హత్య అని తేలినా ఇప్పటికి వరకు ఈ కేసు మిస్టరీ అంతుచిక్కలేదు పోలీసులకు. దీంతో హంతకుడు తలపై భారీ మొత్తంలో నగదును సైతం ప్రకటించారు మృతుల కుటుంబ సభ్యులు. వివరాల్లోకెళ్తే...డ్రగ్ దిగ్గజం అపోటెక్స్ వ్యవస్థాపకుడు బారీ షెర్మాన్ అతని భార్య హనీ ఐదేళ్ల క్రితం టోరంటోలోని వారి ఇంటిలో హత్యకు గురయ్యారు. ఆ బిలినియర్ దంపతులు డిసెంబర్ 15, 2017న మృతి చెందారు. ఐదేళ్లైన ఇప్పటికీ ఈ కేసులో కీలక నిందితులను పట్టుకోవడంలో విఫలమయ్యారు పోలీసులు. వాస్తవానికి భారీ షెర్మాన్ 1974లో అపోటెక్స్ అనే డ్రగ్ కంపెనీని స్థాపించాడు. ఆ తర్వాత దాన్ని ప్రధాన ఔషధ కంపెనీగా తీర్చిదిద్ది అంచెలంచెలుగా బిలినియర్ స్థాయికి ఎదిగాడు. ఆ జంట సుమారు రూ. 400 కోట్ల డబ్బును దాతృత్వ సేవలకు వినియోగించారు. ఆ జంట చనిపోయేటప్పటికీ వారి నికర చరా ఆస్తుల విలువ సుమారు 20 వేల కోట్ల డాలర్లుగా ఫోర్బ్స్ అంచనా వేసింది. ఆ జంట అంత్యక్రియలకు ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో మరియు అంటారియో ప్రావిన్స్ ప్రీమియర్ కాథ్లీన్ వైన్‌తో సహా వేలాది మంది ప్రజలు హాజరయ్యారు. తమ తల్లిదండ్రుల హత్య కేసులో ఎలాంటి పురోగతి లేకపోవడం మమ్మల్ని ఆవేదనకు గురిచేస్తుందని వారి పిల్లలు కుమారుడు జోనాథన్ షెర్మాన్ , కుమార్తె అలెక్స్ క్రావ్జిక్ కన్నీటి పర్యంతమయ్యారు. అలాగే ఈ హత్యకేసు సాధ్యమైనంత తొందరగా చేధించి నిందితుడుని అదుపులోకి తీసుకోవాలని పోలీసులు కోరారు వారు. ఆ హంతకుడి ఆచూకి తెలిపిన వారికి దాదాపు రూ. 500 కోట్లు వరకు అందజేస్తామంటూ ఇది వరకు ప్రకటించిన ఆఫర్‌ని రెడ్డింతలు పెంచి మరీ ప్రకటించారు. పోలీసులు కూడా ఈ కేసుకు సంబంధించి పలువురు కుటుంబసభ్యులను విచారించారు. ఐతే ఈ కేసులో కీలక నిందితులను ఆచూకి మాత్రం లభించలేకపోవడం గమనార్హం. (చదవండి: -
ఆస్ట్రేలియాలో ఢిల్లీ పోలీసులకు చిక్కిన మోస్ట్ వాంటెడ్..
న్యూఢిల్లీ: ఆస్ట్రేలియాలో మోస్ట్ వాంటెడ్ నిందితుడిని ఢిల్లీ పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. నాలుగేళ్ల క్రితం ఆస్ట్రేలియా బీచ్‌లో జరిగిన ఓ యువతి హత్య కేసులో నిందితుడుగా ఉన్న రాజ్వేందర్ సింగ్‌ను(38) పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 2018 ఆక్టోబర్ 21న క్వీన్స్లాండ్ బీచ్‌లో నడుచుకుంటూ వెళ్తుండగా 24 ఏళ్ల తోయా కార్డింగ్లీ యువతి హత్యకు గురైంది. బీచ్ మర్డర్ కేసుగా ఈ ఘటన ఆ దేశంలో చర్చనీయాంశంగా మారింది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన రాజ్విందర్ సింగ్ హత్య చేసిన రెండు రోజులకే దేశం విచిడి పారిపోయాడు. ఉన్నపళంగా ఉద్యోగం, భార్య, ముగ్గురు పిల్లలను వదిలి భారత్‌కు చెక్కేశాడు. పంజాబ్ రాష్ట్రం అమృత్‌సర్‌లోని బటర్ కలాన్‌కు చెందిన రాజ్ విందర్ ఆస్ట్రేలియాలోని ఇన్నిస్ ఫైల్ టౌన్లో నివసించేవాడు. అక్కడే నర్సింగ్ అసిస్టెంట్‌గా పనిచేసేవాడు. ఆస్ట్రేలియా నుంచి పారిపోయి వచ్చిన తర్వాత అతడు పంజాబ్‌లో తలదాచుకున్నాడు. అప్పటి నుంచి ఆస్ట్రేలియన్ పోలీసులు అతని కోసం గాలిస్తున్నారు. 2021 మార్చి నెలలో రాజ్విందర్ సింగ్‌ను అప్పగించాలని ఆస్ట్రేలియా భారత్‌ను కోరింది. అదే ఏడాది నవంబర్‌లో భారత్ అందుకు అంగీకరించింది. కొన్ని వారాల క్రితం రాజ్ విందర్పై క్వీన్స్లాండ్ పోలీసులు భారీ రివార్డు ప్రకటించారు. నిందితుడిని ఆచూకీ తెలిపిన వారికి 1 మిలియన్ ఆస్ట్రేలియన్ డాలర్లు( భారత్ కరెన్సీలో దాదాపు 5 కోట్లు) నజరానా ప్రకటించారు. దీంతో ఈ విషయం అప్పట్లో సంచలనంగా మారింది. కాగా క్వీన్స్లాండ్ పోలీసులు ప్రకటించిన అత్యంత భారీ రివార్డు ఇదే. ఆస్ట్రేలియా అధికారులు, భారత్ అధికారులతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతూనే ఉన్నారు. ఇందు కోసం పంజాబీ, హిందీ మాట్లాడే అయిదుగురు పోలీస్‌లను ఆస్ట్రేలియన్ ప్రభుత్వం నియమించింది. ఫలితంగా నిందితుడు పోలీసులకు చిక్కాడు. చదవండి: Video: చిన్నారిపై అత్యాచారం.. నిందితుడికి ఐదు గుంజీల శిక్ష -
ఆచూకీ చెబితే ఆరుకోట్లు మీవే!!
అర్జంటుగా మీకు కోటీశ్వరులు అయిపోవాలని ఉందా? అయితే ఒకటి కాదు.. రెండు కాదు.. దాదాపు ఆరు కోట్ల రూపాయల భారీ బహుమతి మీ కోసమే వేచి చూస్తోంది. ఇంత పెద్ద బహుమతి ఎవరిస్తున్నారా అనుకుంటున్నారా.. ఇంకెవరు, పెద్దన్న అమెరికానే. మధ్య ఆసియా కేంద్రంగా పనిచేస్తున్న ఓ పెద్ద క్రిమినల్ నెట్వర్క్ గురించి సరైన సమాచారం వాళ్లకు అందిస్తే, ఇంతమొత్తం బహుమతిగా ఇస్తామని అమెరికా విదేశాంగ శాఖ ప్రకటించింది. కమ్చైబెక్ కొల్బయెవ్ అనే ఈ నెట్వర్క్ అలాంటిది, ఇలాంటిది కాదు. డ్రగ్స్, ఆయుధాలు, అమ్మాయిల అక్రమ రవాణాతో పాటు బెదిరించి సొమ్ములు తీసుకోవడం, ఇతర నేరాలకు పాల్పడుతుందని సిన్హువా వార్తాసంస్థ తెరలిపింది.బ్రదర్స్ సర్కిల్ అనే మరో అంతర్జాతీయ నేరగాళ్ల ముఠాతో కూడా దీనికి సంబంధం ఉంది. యూరేషియన్ నేరగాళ్ల బృందానికి చెందిన పలువురు సభ్యులు, నాయకులు కూడా ఇందులో ఉన్నారు. బ్రదర్స్ సర్కిల్ తరఫున పనిచేస్తున్నందుకు కొల్బయెవ్ గ్యాంగును అమెరికా ఎప్పుడో 2012 ఫిబ్రవరిలోనే బ్లాక్‌లిస్ట్ చేసింది.