ప్రభంజనాల్లోనూ గెలవడం మాకు అలవాటే
ఎవరి ప్రభంజనం ఉన్నా విజయం సాధించడం ఎంఐఎంకు ముందునుంచి అలవాటేనని ఆ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికలలలో మొత్తం 44 డివిజన్లలో విజయం సాధించామంటూ ఆయన శుక్రవారం రాత్రి ట్వీట్ చేశారు. ఇందిరాగాంధీ, ఎన్టీ రామారావు, నరేంద్రమోదీల ప్రభంజనం సాగినప్పుడు కూడా తాము గెలిచామని.. అలాగే ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభంజనాన్ని సైతం ఎదురొడ్డి నిలిచి 44 డివిజన్లలో విజయం సాధించామని ఆయన అన్నారు.
అలాగే, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో రీపోలింగ్ జరిగిన ఏకైక డివిజన్ పురానాపూల్లో విజయం సాధించడం పట్ల కూడా ఆయన హర్షం వ్యక్తం చేశారు. పురానాపూల్లో ఎంఐఎం తరఫున హిందూ అభ్యర్థి పోటీ చేశారని.. ఆయన కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన ముస్లిం అభ్యర్థిపై గెలిచి.. అసలైన లౌకిక వాదాన్ని నిరూపించారని అసదుద్దీన్ మరో ట్వీట్లో వ్యాఖ్యానించారు.
MIM tally 44 wards.This party has a record & History of winning even during a Wave of Pol party withstood Indira,NTR,NAIDU,Modi now TRS Wave
— Asaduddin Owaisi (@asadowaisi) February 5, 2016
Subhanallah MIM won PURANAPUL thank you voters of PURANAPUL Hindu candidate of MIM won over Congress Muslim candidate VICTORY Secularism
— Asaduddin Owaisi (@asadowaisi) February 5, 2016