ముగిసిన మిమ్స్ ఉద్యోగుల సమ్మె
నెల్లిమర్ల రూరల్, న్యూస్‌లైన్ : మిమ్స్ వైద్యకళాశాల ఉద్యోగులు చేస్తున్న సమ్మె మంగళవారంతో ముగిసింది. యాజమాన్యంతో జరిగిన చర్చలు సఫలం కావడంతో ఉద్యోగులు బుధవారం విధులకు హాజరయ్యారు. 2011లో యాజమాన్యం ఉద్యోగులతో చేసుకున్న ఒప్పందం 2013 ఆగస్టు లో ముగిసింది. మరలా వేతన ఒప్పందాన్ని కుదుర్చుకోవడానికి యూనియన్ నాయకులు యాజ మాన్యంతో పలు దఫాలు చర్చలు జరిపినా అవి ఫలప్రదం కాలేదు. దీంతో నూతన వేతన ఒప్పం దాన్ని ఏర్పాటు చేయాలంటూ ఉద్యోగులు గత నెల 23 నుంచి నిరవధిక సమ్మెకు దిగారు. చివరకు చర్చలు ఫలించడంతో కార్మికులు విధుల కు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో యూని యన్ నాయకులు బుధవారం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో విలేకరుల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా యూనియన్ అధ్యక్షుడు టీవీ రమణ మాట్లాడు తూ, వార్డ్ బాయ్స్, ఆయాలకు నెలకు రూ.800, కర్ల్, అటెండర్లు, ఏఎన్ఎంలు, ప్లంబింగ్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న వారికి రూ. 1100, స్టాఫ్‌నర్స్‌లకు రూ.1200, టెక్నీషియన్లకు రూ.1600 చొప్పున జీతం పెరిగిందన్నారు. అలాగే ఐదేళ్లు సీనియారిటీ ఉన్న ల్యాబ్ అసిస్టెంట్లకు టెక్నీషియన్లుగా గుర్తించడం, రెండు సంవత్సరాల సర్వీస్ ఉన్నవారికి కనీస వేతనం వర్తింపజేయడానికి యాజమాన్యం ఒప్పుకుందన్నారు. అలాగే ఇతర సమస్యల పరిష్కారానికి కూడా అంగీకరించినట్లు చెప్పారు. యాజమాన్యం తరపున చర్చల్లో మిమ్స్ ట్రస్టీ అల్లూరి సత్యనారాయణరాజు, వినయ్‌వర్మ, లక్ష్మీకుమార్ పాల్గొన్నారన్నారు. సమావేశంలో యూనియన్ నాయకులు మధుసూదనరావు, రాంబాబు, జమ్ము రమణారావు, స్వర్ణల త, శంకుతల, సీఐటీయూ నాయకులు కిల్లంపల్లి రామారావు, వి. రామచంద్రరావు పాల్గొన్నారు.