ఆ బాధితులకు షాకింగ్ న్యూస్
న్యూఢిల్లీ: తమిళనాడులోని తాంబరం విమానాశ్రయంనుంచి అకస్మాత్తుగా కనబడకుండా పోయిన విమానానికి సంబంధించి అధికారులు ఒక ప్రకటన చేశారు. తమవారు ఎప్పటికైనా తిరిగి వస్తారని ఆశగా ఎదురు చూస్తున్న బాధిత కుటుంబాలకు షాకింగ్ న్యూస్ అందించారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కి చెందిన ఏఎన్ 32లో ప్రయాణిస్తున్న 29 మందీ చనిపోయారని భావిస్తున్నామని అధికారులు ప్రకటించారు. ఈ మేరకు బాధితుల కుటుంబాలకు సమాచారం అందించారు. బీమా తదితర ఫార్మాలిటీస్ పూర్తి చేసుకోవాలని కోరినట్టు అధికారిక వర్గాలు తెలిపాయి.
కాగా జూలై 22న భారత వాయుసేన విమానానం గల్లంతైంది. దాదాపు నెలన్నర పాటు 17 షిప్ లు, ఓ సబ్ మెరైన్, 23 విమానాలు మాయమైన వాయుసేన విమానం కోసం భారీ స్థాయిలో అన్వేషన కొనసాగించారు. విమానం జాడ కనుక్కోవడంలో విఫలమై సెర్చింగ్ ను నిలిపివేసిన అధికారులు ఈ మేరకు ప్రకటించారు.దీంతోపాటు జూలైలో జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో రక్షణ మంత్రి మనోహర్ పారికర్ ఈ విషయంపై అధికారికంగా ధృవీకరించకపోయినప్పటికీ, వారంతా మరణించివుండవచ్చని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.