నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు రాక
చిత్తూరు(సెంట్రల్): రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం జిల్లాలోని కురబలకోట మండలం అంగళ్లు కు రానున్నారు. ఆయన పర్యటన వివరాలను కలెక్టర్ సిద్ధార్థ్‌జైన్ మంగళవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. ఉదయం 9-30గంటలకు చంద్రబాబు బెంగళూరులోని హోటల్ ఐటీసీ గార్డీనియా నుంచి బయలుదేరి 10 గంటలకు హెచ్ఏఎల్ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి హెలి కాప్టర్లో బయలుదేరి 11 గంటలకు అంగళ్లు మిట్స్ కళాశాలలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌కు చేరుకుంటారు.
అక్కడ ఏర్పాటుచేసిన వేదికపై బడిపిలుస్తోంది, సూపర్ స్పెషాలిటీ వైద్యశిబిరాన్ని ప్రారంభిస్తారు. అనంతరం మధ్యాహ్నం 12-05గంటలకు నంది గార్డెన్స్‌లో పొలం పిలుస్తోంది కార్యక్రమాన్ని ప్రారంభించి అక్కడ జన్మభూమి-మాఊరు కార్యక్రమంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 2 గంటలకు బయలుదేరి మిట్స్ కళాశాలకు చేరుకుని 2-45గంటలకు వరకు అక్కడే విశ్రాంతి తీసుకుంటారు. తిరిగి హెలికాప్టర్లో బయలుదేరి సాయంత్రం 3-25 గంటలకు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి హైదరాబాద్‌కు వెళతారు.