జిల్లా ఆస్పత్రికి ఎర్రశేఖర్
మహబూబ్‌నగర్ క్రైం,న్యూస్‌లైన్: సోదరుడి హత్యకే సులో జిల్లా జైలు లో రిమాండ్ ఖైదీగా ఉన్న జడ్చర్ల ఎమ్యె ల్యే ఎర్ర శేఖర్ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నాడు. వైద్యచికిత్సల కోసం ఆ యన బుధవారం జిల్లా ఆస్పత్రిలో చేరా డు. గత మూడు రోజులుగా విచారణ ని మిత్తం పోలీసుల అదుపులో పలు ప్రాం తాలకు ప్రత్యేక వాహనంలో ప్రయాణించడంతో తీవ్ర అనారోగ్యనికి గురైనట్లు తెలి సింది.
జ్వరంతో పాటు జాండిస్, షుగర్‌తోపాటు ఛాతీనొప్పితో బాధపడుతున్నట్లు సమాచారం. దీంతో ఆయనను జిల్లా జైలు అధికారులు వైద్యచికిత్సల కోసం సాయంత్రం జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఇక్కడే ప్రత్యేక గది నెం.201లో ఆయనకు వైద్యసేవలు అందిస్తున్నారు. డ్యూటీడాక్టర్ ప్రవీణ్‌కూమార్ నేతృత్వంలోని వైద్య సిబ్బంది ఎర్ర శేఖర్‌ను పరీక్షించారు. ఛాతీనొప్పితో బాధపడుతున్న ఆయనకు ఈసీజీతో పాటు బీపీ, షుగర్ పరీక్షలు నిర్వహించినట్లు వైద్యులు తెలిపారు. మరో రెండుమూడు రోజల పాటు వైద్య చికిత్సలు అందించే అవసరం ఉందని చెప్పారు. ఎమ్మెల్యే ఎర్రశేఖర్‌కు గట్టి పోలీసు బందోబస్తు మధ్య వైద్యచికిత్సలు కొనసాగుతున్నాయి.
నేడు ఎర్ర శేఖర్ బెయిల్‌పై తీర్పు
మహబూబ్‌నగర్ లీగల్ న్యూస్‌లైన్: ఎమ్మెల్యే ఎర్రశేఖర్ బెయిల్ పిటిషన్‌పై బుధవారం వాదనలు ముగిశాయి. ఎమ్మెల్యే, ఆయన అనుచరులు, భార్య భవాని ముందస్తు బెయిల్ పిటిషన్లపై వాదనలు జరిగాయి. మొదటి అదనపు జిల్లా జడ్జి భజరంగబాబు నేడు బెయిల్‌పై తీర్పు ఇవ్వనున్నారు.