విశాఖలో సుబ్బరామిరెడ్డికి చేదు అనుభవం
విశాఖ : రాజ్యసభ సభ్యుడు సుబ్బరామిరెడ్డికి సోమవారం విశాఖలో చేదు అనుభవం ఎదురైంది. ఆయన వాహనాన్ని జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద సమైక్యవాదులు అడ్డుకున్నారు. రాజీనామా చేసి ఉద్యమంలోకి రావాలని డిమాండ్ చేస్తూ సమైక్యవాదులు... సుబ్బరామిరెడ్డిని ఘొరావ్ చేశారు.
మరోవైపు చిత్తూరు జిల్లా మదనపల్లె ఎమ్మెల్యే షాజహాన్‌కు సమైక్య సెగ తగిలింది. సమైక్యాంధ్ర కోసం మదనపల్లెలో ఏర్పాటు చేసిన లక్షగళ సమరభేరి కార్యక్రమంలో పాల్గొనేందకు వచ్చిన ఆయనను సమైక్యవాదులు అడ్డుకున్నారు. ఎమ్మెల్యే గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. దీంతో నిర్వాహకులు షాజహాన్‌ను అక్కడి నుంచి పంపేసారు.