హైక్ నుంచి ఉచిత కాల్స్
న్యూఢిల్లీ: భారతీ ఎయిర్టెల్, సాఫ్ట్‌బ్యాంక్ కార్పొరేషన్ల జాయింట్ వెంచర్, ప్రముఖ మొబైల్ చాట్ అప్లికేషన్, హైక్ మెసెంజర్ ఆంతర్జాతీయంగా ఉన్న తన వినియోగదారులకు ఉచిత కాల్స్‌ను అందించనుంది. ఈ సేవలు యూఎస్‌కు చెందిన జిప్ ఫోన్ అప్లికేషన్ ద్వారా ఒక నెలలోగా అందుబాటులోకి రానున్నాయి. వీటికి ఇంటర్నెట్ కనెక్షన్ తప్పనిసరిగా ఉండాలి.తొలిగా ఆండ్రాయిడ్ ఫోన్లలో తర్వాత విండోస్, ఓఎస్ మొబైళ్లలో కూడా ఈ సర్వీస్‌ను అందుబాటులోకి తెస్తామని హైక్ పేర్కొంది.
‘భారత మార్కెట్ చాలా ఖరీదైన, సున్నితమైంది. డాటా సర్వీసులల్లో మాకు బాగా అనుభవం ఉంది. మా కస్టమర్లు ఒక ఎంబీతో ఎక్కువ నిమిషాలు మాట్లాడుకోవచ్చు. దీనితోపాటు ఉచిత కాల్స్ సర్వీస్‌ను అంతర్జాతీయంగా అందుబాటులోకి తెస్తున్నాం’ అని హైక్ సీఈఓ కవిన్ మిట్టల్ చెప్పారు.