మొబైల్‌తో స్టార్‌బక్స్ కాఫీ ఆర్డర్!
న్యూఢిల్లీ: మీరు స్టార్‌బక్స్ కాఫీ ప్రియులా? అయితే స్టార్‌బక్స్ కాఫీని మొబైల్ ద్వారా ఆర్డర్ చేసే రోజులు త్వరలో రానున్నాయి. ‘కస్టమర్లు త్వరలో మీ మొబైల్ సాయంతో స్టార్‌బక్స్ కాఫీ కోసం ఆర్డర్ ఇవ్వొచ్చు. రివార్డ్స్ కార్డు ద్వారా చెల్లింపు జరపొచ్చు. మాకు దేశంలో ఇప్పటికే 1,60,000 యాక్టివ్ మై స్టార్‌బక్స్ రివార్డ్స్ ప్రోగ్రామ్ యూజర్లు ఉన్నారు’ అని టాటా స్టార్‌బక్స్ సీఈవో సుమి ఘోష్ తెలిపారు. ప్రపంచ ంలోని ఇతర దేశాలతో పోలిస్తే తాము భారత్‌లో చాలా వేగంగా విస్తరిస్తున్నామని పేర్కొన్నారు.
‘అమెరికాలో మా సంస్థకు సంబంధించిన 25 శాతం లావాదే వీలు స్టార్‌బక్స్ యాప్ ద్వారానే జరుగుతున్నాయి. యాప్ సాయంతో దగ్గరిలోని ఔట్‌లెట్‌ను తెలుసుకోవచ్చు. అలాగే దాని ద్వారా స్టార్‌బక్స్ కార్డు సాయంతో కాఫీ కోసం ఆర్డర్ ఇవ్వొచ్చు’ అని వివరించారు. ఇలాంటి సేవలను ఈ ఏడాది భారత్‌లో తొలిసారి ప్రారంభిస్తామని తె లిపారు. ఇక్కడ వృద్ధి అపార అవకాశాలు ఉన్నాయన్నారు. అమెరికాకు చెందిన స్టార్‌బక్స్ 2012లో టాటా గ్రూప్‌తో జాయింట్ వెంచర్ ఏర్పాటు ద్వారా భారత్‌లోకి అడుగుపెట్టింది. దీనికి దేశంలో 83 ఔట్లెట్స్ ఉన్నాయి.