మనీ విత్ డ్రా పరిమితులపై కేంద్రం వెసులుబాటు
ఢిల్లీ : దేశ వ్యాప్తంగా గత నాలుగు రోజులుగా నోట్ల మార్పిడితో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలకు కేంద్ర ప్రభుత్వం కొంత వెసులుబాటు కల్పించింది. మనీ విత్ డ్రా పరిమితుల్లో మార్పులు చేసింది. పాత నోట్ల మార్పిడి పరిమితిని రూ.4 వేల నుంచి రూ.4500 కు పెంచింది. రోజుకు రూ.10 వేలు మాత్రమే విత్ డ్రా నిబంధనను ఉపసంహరించుకుంది.
వారానికి విత్ డ్రా పరిమితిని రూ.20 వేల నుంచి రూ.24 వేలకు పెంచింది. ఏటీఎంలో విత్ డ్రా పరిమితిని రూ.500 పెంచడంతో రోజుకు రూ.2500 విత్ డ్రా చేసుకోవచ్చు. సవరించబడిన కొత్త నిబంధనలు సాఫ్ట్వేర్ అప్డేట్ అయిన ఏటీఎంలకు మాత్రమే వర్తిస్తుందని కేంద్రం వెల్లడించింది.