mother in law murder
-
మారువేషంలో దొంగగా వచ్చి అత్తను చితకబాదిన కోడలు.. కానీ..!
తమిళనాడులో అమానవీయ ఘటన జరిగింది. మారువేశంలో దొంగగా వచ్చిన కోడలు అత్తను చితకబాదింది. తీవ్ర గాయాలపాలైన అత్త ప్రాణాలు కోల్పోయింది. తిరునల్వేలి జిల్లాలోని వడుకనపట్టి గ్రామంలో ఈ ఘటన జరిగింది. గ్రామంలో శణ్ముగవేలు భార్య సీతారామలక్ష్మి (57). వారికి కుమారుడు రామస్వామి, కోడలు మహాలక్ష్మి ఉన్నారు. ఇంట్లో అత్తాకోడళ్లు తరచూ గొడవ పడుతుండేవారు. దీంతో పరిస్థితిని మెరుగుపరచడానికి రామస్వామి భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి మకాం మార్చినా.. ప్రయోజనం లేకపోయింది. ఇటీవల జరిగిన గొడవ అనంతరం అత్తపై కక్ష పెంచుకున్న మహాలక్ష్మి పథకం వేసింది. మగవారి వేశం వేసి హల్మెట్ పెట్టుకుని అత్త నిద్రిస్తున్న సమయంలో ఆమెపై దాడి చేసింది. అత్త నుంచి బంగారం గొలుసు లాక్కెళ్లింది. తీవ్ర గాయాలపాలైన అత్త ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటూ చనిపోయింది. అయితే.. కేసు నమోదు చేసిన పోలీసులకు సీసీటీవీ అధారాలతో అసలు విషయం బయటపడింది. కోడలే ఈ ఘటనకు కారకురాలని తేల్చారు. చదవండి:కంపెనీ డబ్బుతో డ్రైవర్ పరార్... ఓనర్ ఏం చేశాడంటే... -
దారుణం : తల, మొండెం వేరు చేసి..
సాక్షి, పశ్చిమగోదావరి : జిల్లాలోని కుక్కునూరు మండలం చింతలగూడెంలో దారుణం జరిగింది. అత్తను అత్యంత కిరాతకంగా నరికి చంపి పోలీసులకు లొంగిపోయాడు ఓ దుర్మార్గపు అల్లుడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చింతల గూడెంకు చెందిన రాజ, తన భార్యకు గొడవ జరిగింది. తమ మధ్య కలహాలకు అత్త ముడివి నాగమ్మ(65) కారణం అని అనుమానించిన రాజు ఆమెను చంపేందుకు కుట్ర పన్నాడు. వేట కత్తి తీసుకొని చింతల గూడెం వచ్చిన రాజు.. నాగమ్మను అత్యంత దారుణంగా నరికి చంపాడు. తల, మొండెం వేరు చేసి ఒక్కోచోట పాడేశాడు. అనంతరం కుక్కునూరు పోలీసు స్టేషన్కు వెళ్లి లొంగిపోయాడు. రాజుపై కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టామని పోలీసులు పేర్కొన్నారు. -
అత్తను అమానుషంగా చంపి ఆపై..!
న్యూఢిల్లీ : అత్తను తానే హత్య చేసి ఓ ప్రమాదంగా చిత్రీకరించబోయి ఓ మహిళ చిక్కుల్లో పడింది. తాను తవ్వుకున్న గోతిలో తానే పడింది. పోలీసులు వివరాల ప్రకారం ఢిల్లీకి చెందిన కంచన్ కపూర్ (30) అనే మహిళకు తన అత్త స్వర్ణకు(62) ప్రతి రోజు గొడవలు అవుతుండేవి. పైగా ఆమె వికలాంగురాలు. అయితే, మంగళవారం రాత్రి గొడవ పడిన కాంచన్ ఓ బ్యాట్లాంటి వస్తువుతో స్వర్ణ తలపై కొట్టడంతో ఆమె అక్కడికక్కడే చనిపోయింది. ఈ విషయం బయటకు పొక్కుతుందనే భయంతో ఓ ప్రమాదంగా చిత్రీకరించే ప్లాన్ చేసి ఆమె మృతదేహాన్ని తగులబెట్టే ప్రయత్నం చేసింది. అయితే, మృతదేహం సగం మాత్రమే కాళ్ల వరకే కాలింది. ఈ విషయం బయటకు తెలిసి పోలీసులు ఆమెను విచారించగా తానే హత్య చేసినట్లు అంగీకరించింది. -
అత్తగారి హత్యకేసు.. ఎన్నారై మహిళకు విముక్తి
తన అత్తగారిని హత్యచేసిన కేసులో ఎన్నారై మహిళను అమెరికా జైలు నుంచి విడుదల చేశారు. 2012లో జరిగిన ఈ హత్య.. కేవలం మొదటి డిగ్రీ హత్య మాత్రమేనని భావించడంతో ఆమెను కాలిఫోర్నియాలోని సట్టర్ కౌంటీ జైలు నుంచి విడుదల చేశారు. తన గర్భంలో ఉన్నది ఆడ శిశువని తెలియడంతో తన అత్త బల్జీత్ కౌర్ అబార్షన్ చేయించాలని చూసిందని, అందుకే ఆమెను హత్య చేయాల్సి వచ్చిందని నిందితురాలు బల్జీందర్ కౌర్ తన న్యాయవాది మని సిద్ధు ద్వారా కోర్టుకు తెలిపారు. 2012 అక్టోబర్ 24న ఈ హత్య జరిగింది. తన అత్తగారు తనకు అబార్షన్ చేయించేందుకు ఆస్పత్రికి తీసుకెళ్లిందని, అయితే అక్కడ తాను నిరాకరించానని బల్జీందర్ కౌర్ చెప్పారు. లింగవివక్షతో తన గర్భస్థ శిశువు అంతం కాకుండా ఉండాలన్న ఉద్దేశంతోనే కౌర్ పోరాడారని, లేనిపక్షంలో పదికోట్ల మంది భారతీయ గర్భస్థ శిశువుల్లాగే ఈమె శిశువు కూడా మరణించి ఉండేదని సిద్ధు వాదించారు. ఏప్రిల్ 25న బల్జీందర్ కౌర్ జైలు నుంచి విడుదలయ్యారు. జైల్లో ఉండగానే ఆమె తన రెండో కుమార్తెకు జన్మనిచ్చారు. ఆమెను తాము నిర్దోషిగా కాక.. నేరం చేయలేదని భావించినట్లు కోర్టు వర్గాలు తెలిపాయి. ఈ సంవత్సరం ఏప్రిల్ 15న విచారణ ప్రారంభమై ఏడు రోజుల్లో ముగిసింది.