నిరంతర సాధనతోనే సంగీతం
విజయవాడ కల్చరల్: నిరంతర సాధనవల్లనే సంగీతం అలవడుతుందని సినీ సంగీత దర్శకుడు వీణాపాణి అన్నారు. ఆంధప్రదేశ్ భాషా సాంస్కృతిక శాఖ ఘంటసాల వెంకటేశ్వరరావు ప్రభుత్వ సంగీత కళాశాలలో 15 రోజులుగా నిర్వహిస్తున్న 72 మేళ కర్తరాగాల అవగాహన సదస్సు శుక్రవారం ముగిసింది. ఆయన మాట్లాడుతూ కర్నాటక సంగీతం భారతీయ సంగీత సంప్రదాయానికే తలమానికమని తెలిపారు. ఆంధ్ర ఆర్ట్స్ అకాడమీ ప్రధాన కార్యదర్శి గోళ్ల నారాయణరావు మాట్లాడుతూ స్వరకామాక్షి కీర్తన సంగీత ప్రపంచంలో చిరస్థాయిగా మిగిలిపోతుందన్నారు. ఘంటసాల సంగీత కళాశాల ప్రిన్సిపాల్ గోవిందరాజన్ మాట్లాడుతూ అవగాహన సదస్సులో నేర్చుకున్న అంశాలను సాధన చేయాలని సూచించారు. సంగీత కళాశాల అధ్యాపక అధ్యాపకేతిర సిబ్బంది పాల్గొన్ని వీణాపాణిని సత్కరించారు.