సోలార్ ప్లాంట్‌కు నోటీసులు
మూడు రోజులు గడువు
రేగోడ్: ఎట్టకేలకు అధికారులు స్పందించారు. నిబంధనలకు విరుద్ధంగా కొనసాగుతున్న సోలార్‌ప్లాంట్ యాజమాన్యానికి శనివారం నోటీసులు జారీ చేశారు. మూడు రోజుల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించారు. ఈ నెల 3న సాక్షి దినపత్రికలో ‘సోలార్.. పారాహుషార్’ అనే కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. దీనిపై టి.లింగంపల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శి రాములు స్పందించారు.
సోలార్ పవర్ ప్లాంట్ వద్దకు వెళ్లి పనులు నిర్వహిస్తున్న బాధ్యులకు ఎంవీ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ వీ.మంజునాథ పేరుమీద నోటీసులు జారీ చేశారు. ఈ సందర్భంగా పంచాయతీ కార్యదర్శి రాములు మాట్లాడుతూ పంచాయతీ అనుమతి పొందకుండా పనులు నిర్వహిస్తున్న సోలార్ ప్లాంట్ నిర్వాహకులకు నోటీసులు అందజేసినట్లు తెలిపారు.
నిబంధనల ప్రకారం ఆధారాలు చూపి సోలార్ పనులకు పంచాయతీ నుంచి మూడు రోజుల్లోపు అనుమతి తీసుకోకపోతే ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తగిన చర్యలు తీసుకుంటానని చెప్పారు.