అమ్మ స్వీట్స్ మిస్సవుతున్నా
దీపావళి సందర్భంగా అమ్మ తయారు చేసే స్వీట్స్ తినే యోగం ఈసారి తనకు లేదని లక్ష్మీరాయ్ పేర్కొంది. ఈ భామ కొంచెం విరామం తర్వాత కోలీవుడ్లో నటిస్తున్న చిత్రం అరణ్మనై. సుందర్.సి స్వీయ దర్శకత్వంలో హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో హన్సిక, ఆండ్రియా మరో ఇద్దరు హీరోయిన్లు. లక్ష్మీరాయ్ మాట్లాడుతూ దీపావళి రోజునా అరణ్మనై షూటింగ్లో పాల్గొనాల్సి ఉందని చెప్పింది. ప్రతి ఏడాదీ దీపావళికి ఇంటి దగ్గరే ఉండేదానినని తెలిపింది.
ఈ సందర్భంగా అమ్మ తయూరు చేసే రకరకాల స్వీట్స్ తృప్తిగా తినే దానినని పేర్కొంది. ఈ సారి అరణ్మనై షూటింగ్ కారణంగా అమ్మ స్వీట్స్ తినే అవకాశం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. అయితే దర్శకులు సుందర్.సి దీపావళి సందర్భంగా యూనిట్ అందరికీ స్వీట్స్ పంచుతానన్నారని చెప్పింది. మరో ఆనందం ఏమిటంటే అరణ్మనై చిత్రంలో ముగ్గురు హీరోయిన్లు ఉన్నా తన పాత్రకు అధిక ప్రాముఖ్యమని వివరించింది.