n sikki reddy
-
బాడ్మింటన్ స్టార్ సిక్కిరెడ్డికి కరోనా పాజిటివ్
-
గోపీచంద్ అకాడమీలో కరోనా కలకలం
హైదరాబాద్: నగరంలోని పుల్లెల గోపీచంద్ అకాడమీలో కరోనా కలకలం రేగింది. గోపీచంద్ అకాడమీలో ప్రాక్టీస్ చేస్తున్న షట్లర్ సిక్కిరెడ్డి కరోనా బారిన పడ్డారు. ఆమెతో పాటు ఫిజియోథెరపిస్ట్ కిరణ్ జార్జ్‌కు సైతం కరోనా వైరస్ సోకింది. వీరికి కరోనా లక్షణాలు కన్పించడంతో టెస్టులు చేయగా పాజిటివ్ వచ్చింది. దాంతో వీరిద్దరూ హోమ్ ఐసోలేషన్లోకి వెళ్లారు. అదే సమయంలో గోపీచంద్ అకాడమీని తాత్కాలికంగా మూసివేసిన అధికారులు.. శానిటైజ్ చేశారు. కాగా, అదే అకాడమీలో స్టార్ షటర్లు పీవీ సింధు, పారుపల్లి కశ్యప్, సైనా నెహ్వాల్‌లు ప్రాక్టీస్ చేస్తూ ఉండటంతో వారిలో ఆందోళన మొదలైంది. శాయ్ నిబంధనల మేరకు అకాడమీలోని అందరికీ కరోనా పరీక్షలు నిర్వహించనున్నారు. ఆటగాళ్లు, కోచ్‌లు, సహాయక సిబ్బందికి కరోనా టెస్టులు చేయనున్నారు. అయితే సిక్కిరెడ్డి, కిరణ్ జార్జ్‌లను కలిసిన వారిని గుర్తించే పనిలో ఉన్నారు. వీరితో ఎవరు ప్రైమరీ కాంటాక్ట్ అయ్యారో వారి వివరాలు సేకరిస్తున్నారు. సిక్కిరెడ్డి, కిరణ్ జార్జ్‌లకు మరొకసారి ఆర్టీ పీసీఆర్ టెస్టులు చేయనున్నారు.ఇప్పటికే పలువురు హాకీ ఆటగాళ్లకు కరోనా వైరస్ సోకగా, క్రికెట్లో కూడా కరోనా కలవరం మొదలైంది. తాజాగా సిక్కిరెడ్డి, కిరణ్ జార్జ్‌లు కరోనా వైరస్ సోకడం క్రీడాకారుల్లో మరింత ఆందోళన రేకెత్తిస్తోంది. -
సిక్కి రెడ్డి ‘డబుల్’ ధమాకా
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రానికి చెందిన బ్యాడ్మింటన్ క్రీడాకారిణి ఎన్.సిక్కి రెడ్డి ఉగాండాలో జరిగిన అంతర్జాతీయ బ్యాడ్మింటన్ చాలెంజ్ టోర్నీలో డబుల్ ధమాకా సాధించింది. పూర్వీషా రామ్ (బెంగళూరు)తో కలిసి మహిళల డబుల్స్ టైటిల్ గెలిచిన సిక్కి రెడ్డి... తరుణ్ కొనాతో మిక్స్డ్ డబుల్స్ ట్రోఫీ నెగ్గింది. మహిళల డబుల్స్ ఫైనల్లో సిక్కిరెడ్డి-పూర్వీష జంట 11-7, 6-11, 8-11, 11-7, 11-3తో నెగిన్- సొరయ హజియాగ (ఇరాన్) జోడిపై గెలిచింది. కొత్త పాయింట్ల పద్ధతి ప్రకారం పోటీలు జరిగాయి. మిక్స్డ్ డబుల్స్‌లో సిక్కి రెడ్డి-తరుణ్ ద్వయం 11-8, 11-10, 11-6తో మహ్మద్ అలీ కుర్త్-ఇనాల్ కదేర్ (టర్కీ) జంటపై గెలిచింది. ఇటీవల చక్కని ప్రదర్శనతో పతకాలు సాధిస్తున్న తెలంగాణ అమ్మాయిని రాష్ట్ర బ్యాడ్మింటన్ సంఘం అధ్యక్షుడు, మంత్రి కె.రామారావు, కోచ్ గోపీచంద్ అభినందించారు. జాతీయ క్రీడలకు ముందు విజయవాడలో సీనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో మహిళల డబుల్స్ టైటిల్ గెలిచిన సిక్కిరెడ్డి, కేరళ ఆతిథ్యమిచ్చిన జాతీయ క్రీడల్లో 2 స్వర్ణాలు, ఒక రజతం గెలుచుకుంది.