కొనసాగుతున్న పాలిసెట్ కౌన్సెలింగ్
నంద్యాలఅర్బన్: పాలిటెక్నిక్ కళాశాలల ప్రవేశానికి నిర్వహిస్తున్న పాలిసెట్ 2017 కౌన్సెలింగ్ కొనసాగుతుంది. స్థానిక పాలిటెక్నిక్ కళాశాలలో గత నెల 30 నుంచి జరుగుతున్న కౌన్సెలింగ్లో ర్యాంకులు పెరిగే కొద్ది విద్యార్థుల సంఖ్య పెరుగుతుంది. కళాశాల ప్రిన్సిపాల్ విజయభాస్కర్ పర్యవేక్షణలో శనివారం 45,001 ర్యాంకు నుంచి 60వేల ర్యాంకు వరకు నిర్వహించిన కౌన్సెలింగ్కు 189మంది విద్యార్థులు హాజరయ్యారు. అదే విధంగా కౌన్సెలింగ్ పూర్తయిన 1 నుంచి 30వేల ర్యాంకు విద్యార్థులు కళాశాలలను ఎంపిక చేసుకుంటున్నారు.