naranagepalli
-
నేత్రపర్వంగా జ్యోతుల ఉత్సవం
నారనాగేపల్లి (రొద్దం) : మండలంలోని నారనాగేపల్లి గ్రామంలో మంగళవారం గ్రామ దేవత ముత్యాలమ్మకు నేత్రపర్వంగా జ్యోతుల ఉత్సవం నిర్వహించారు. ఉదయం అమ్మవారికి అభిషేకాలు, అర్చనలు తదితర ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామ మహిళలు పెద్ద ఎత్తున జ్యోతులను అమ్మవారికి మోసి మొక్కులు తీర్చుకున్నారు. ఉత్సవంలో వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు శంకరనారాయణ, పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి, స్థానిక ఎమ్మెల్యే బీకే పార్థసారథి సతీమణి కమలమ్మ, జిల్లా నలమూలల నుంచి పలు పార్టీల నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. -
బండెక్కిన బిందెలు
రొద్దం (పెనుకొండ) : మండలంలోని నారనాగేపల్లిలో తాగునీటి సమస్య తాండవిస్తోంది. గ్రామంలో 400 ఇళ్లు, 2 వేలకు పైగా జనాభా ఉంది. గ్రామంలో మూడు నెలలుగా తాగునీటి సమస్య నెలకొంది. దీంతో గ్రామస్తులు రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న కర్ణాటక రాష్ట్రం పెండ్లిజీవి గ్రామం పెన్నానది వద్ద ఉన్న చేతిపంపును ఆశ్రయిస్తున్నారు. భగభగ మండే ఎండను సైతం లెక్క చేయకుండా కాలి నడకన, ఎద్దుల బండ్లలో వెళ్లి నీటిని తెచ్చుకుంటున్నారు. సమస్య పరిష్కరిస్తాం : - మనోహర్, సర్పంచ్, నారనాగేపల్లి భూగర్భజలాలు అడుగంటిపోవడంతో సమస్య ఏర్పడింది. టాంకర్ల ద్వారా కొన్ని రోజులు నీటిని సరఫరా చేశాం. తర్వాత అధికారులు ఒప్పుకోకపోవడంతో ట్యాంకర్లను ఆపేశాం. అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారానికి ప్రత్యామ్నాయ చర్యలు చేపడుతాం.